Advertisement
Google Ads BL

శ్రీముఖితో గొడవలు, లవ్‌పై పెదవి విప్పిన రవి!!


శ్రీముఖితో రాహుల్ సిప్లిగంజ్‌కి.. బిగ్‌బాస్ హౌస్‌లో విభేదాలు రావడం.. బయటికొచ్చాక ఆ విభేదాలు కొనసాగినా.. నిన్నగాక మొన్న ప్యాచప్ చెప్పుకుని కలిసిపోయారు. ఇక శ్రీముఖి బిగ్‌బాస్‌కి వెళ్ళకముందు ఈటీవీ ప్లస్‌లో ‘పటాస్’ షో నుంచి బయటికొచ్చెయ్యడం, తర్వాత యాంకర్ రవితో శ్రీముఖికి గొడవలయ్యాయి కాబట్టే ఆమె పటాస్ షో ని వదిలేసింది అనే టాక్ నడిచింది. ఈటీవీ ప్లస్‌లో ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న ‘పటాస్ షో’ శ్రీముఖి ఎగ్జిట్‌తో రేటింగ్ అమాంతం పడిపోయిందని.. రవి కూడా పటాస్ షోని ఎత్తలేక చేతులెత్తేశాడని అన్నారు. ఇక శ్రీముఖి బిగ్‌బాస్ హౌస్‌లో తన లైఫ్‌లో జరిగిన ఒక బాధాకర లవ్ స్టోరీ చెప్పడం అది యాంకర్ రవికి కనెక్ట్ చేసి న్యూస్‌లు రావడం అబ్బో చాలానే జరిగింది.

Advertisement
CJ Advs

ఇక రవితో యాంకరింగ్ చేస్తావా..? శ్రీముఖి అంటే.. మా నాన్న చెయ్యమంటే చేస్తా అని చెప్పడంతో.. వీరి మధ్యన ఏదో గట్టిగానే గొడవ జరిగింది అని అనుకున్నారు. అయితే ఈ విషయమై రవి గానీ.. శ్రీముఖి గాని స్పందించలేదు. ఇక వారి మధ్యన గొడవలు అని జనాలు ఫిక్స్ అయ్యారు. తాజాగా యాంకర్ రవి.. శ్రీముఖికి నాకు ఎలాంటి గొడవలు లేవని, మంచి ఆఫర్ రావడంతో శ్రీముఖి పటాస్ షోని వదిలేసిందిగాని, మంచి ఆఫర్ వస్తే ఎవరైనా అలానే చేస్తారని, ఇక నాకు మంచి అవకాశాలు రావడంతో నేను పటాస్‌ని వదిలేసానని, అంతేకాని శ్రీముఖితో నాకెలాంటి గొడవలు లేవని తేల్చిచెప్పేశాడు. అంతేకాదు.. శ్రీముఖి నాకెప్పుడూ ఫ్రెండ్ అని, ఇక యాంకరింగ్‌లో శ్రీముఖి ది ఓ డిఫెరెంట్ స్టయిల్ అని.. తానొక పంచ్ వేస్తే.. దానికి శ్రీముఖి పది పంచ్‌లు వెయ్యగల సత్తా కలిగిన అమ్మాయని చెప్పుకొచ్చాడు. నాకు, శ్రీముఖికి  గొడవలు జరిగాయని బయట ప్రచారం జరుగుతుందని, కానీ మేం ఏం లేదని చెప్పినా రాసుకునే వాళ్ళు రాసుకుంటారని, ఇక మేము క్లారిటీ ఇచ్చినా వేస్ట్ అని అందుకే నేను గాని శ్రీముఖి గానీ ఈ విషయంలో స్పందించలేదని చెప్పుకొచ్చాడు. మరి ఇందులో ఏ మాత్రం నిజముందో పైనున్న పెరుమాళ్లకే ఎరుక.

Anchor Ravi Gives Clarity on Sreemukhi Love and Other allegations:

Anchor Ravi Gives Clarity on Sreemukhi Love and Other allegations  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs