Advertisement
Google Ads BL

ఇలియానాపై స్టార్ హీరోకి మండింది.. అందుకే!!


టాలీవుడ్ ఇలియానా ఒక్క రామ్ చరణ్ తప్ప అందరితో నటించింది. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, పవన్, అల్లు అర్జున్ ఇలా అందరితో నటించింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ కాస్త.. బాలీవుడ్ అవకాశాలతో అక్కడికి ఎగిరిపోయింది. ఇప్పుడు టాలీవుడ్‌లో అవకాశాలే లేకుండా పోయాయి. అయితే ఇలియానాకి టాలీవుడ్‌లో ఆఫర్స్ తగ్గడానికి బాలీవుడ్ మీద మోజు కాదని.. ఇక్కడ ఓ స్టార్ హీరో ఇలియానాకు ఉన్న విభేదాలే ఇలియానా అవకాశాలకు గండికొట్టడానికి కారణమనే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా ప్రచారంలోకొచ్చింది. ఇలియానా టాప్ రేంజ్‌కి చేరువలో ఉన్నప్పుడే ఆ హీరోతో విభేదాల కారణం అవకాశాలు పోగొట్టుకుని.. బాలీవుడ్‌లో వచ్చిన అవకాశంతో సర్దుకుపోయిందని అంటున్నారు.

Advertisement
CJ Advs

ఇంతకీ ఇలియానాతో స్టార్ హీరో విభేదాలంటూ వస్తున్న వార్తలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు వినబడుతుంది. ఇలియానా ఎన్టీఆర్ తో రాఖి, శక్తి సినిమాలు చేసింది. అందులో రాఖి యావరేజ్ కాగా... శక్తి డిజాస్టర్. శక్తి సినిమా టైం లోనే ఇలియానా ప్రవర్తన ఎన్టీఆర్‌కి చిరాకు తెప్పించిందని, సినిమా షూటింగ్ సమయంలో తన సీన్స్ సమయంలో మాత్రమే ఇలియానా హీరోయిన్ కార్వాన్ వెహికల్ నుంచి బయటకు రావడం.. తన సీన్ షూట్ పూర్తికాగానే మళ్ళి కార్వాన్‌కి వెళ్లిపోవడం, మిగతా విషయాలేమీ ఇలియానా పట్టించుకోకపోవడం.. అలాగే సినిమా ప్రమోషన్స్‌కి ఎగ్గొట్టడం వంటి విషయాలతో ఎన్టీఆర్ అసంతృప్తికి ఇలియానా కారణమయ్యిందట.

అలాగే ‘శక్తి’ టీం తో కలవకుండా డిస్టెన్స్ మెయింటింగ్ చేసేదని, శక్తి సినిమా ఇంటర్వ్యూలో తనకి కథ చెప్పింది ఒకటి, సినిమా తీసింది ఒకటి అంటూ శక్తి సినిమాపై, దర్శకుడు మెహర్‌పై ఇలియానా చేసిన వ్యాఖ్యలు అప్పట్లోనే దుమారం రేపాయి. అయితే అప్పట్నుంచి ఇలానే‌కి టాలీవుడ్ దర్శకనిర్మతలు లైట్ తీసుకున్నారని, శక్తి టైం లో సైన్ చేసిన సినిమాల్లో నటించిన ఇలియానా ని తర్వాత టాలీవుడ్ దూరం పెట్టిందని లేటెస్ట్ న్యూస్.

News About Ileana and Tollywood Star Hero:

News About Ileana and Tollywood Star Hero  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs