Advertisement
Google Ads BL

‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’.. అంచనాలకు మించేలా!


అడుగడుగునా అయ్యప్ప అనుగ్రహంతో ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’ రచయిత-నిర్మాత వి.ఎస్.పి.తెన్నేటి

Advertisement
CJ Advs

100 క్రోర్స్ అకాడమీ, వరాంగి మూవీస్ పతాకంపై రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) దర్శకతంలో ప్రముఖ రచయిత మరియు ఆధ్యాత్మికవేత్త  వి.ఎస్.పి.తెన్నేటి-టి.ఎస్.బద్రిష్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’. సుమన్ తెలుగులో హీరోగా నటించిన 100వ చితమిది. ఈ చిత్రానికి వి.ఎస్.పి తెన్నేటి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చి తనే స్వయంగా నిర్మించారు.. వి.ఎస్.ఎల్ జయకుమార్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రానికి శంకర్ మహదేవన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో గాత్రమందించారు. ఈ భక్తిరస ప్రధాన చిత్రం ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చడంతోపాటు.. చిత్ర నిర్మాత కూడా అయిన వి.ఎస్.పి తెన్నేటి మీడియాతో ముచ్చటించారు. అయ్యప్ప కటాక్షం అనగానే.. అందరూ ఒక తరహా కథను ఊహిస్తారు. కానీ ఈ సినిమా అలా ఉండదు. అంచనాలను మించి ఉంటుంది. ఒక భక్తి రస ప్రధానమైన చిత్రాన్ని ఇంత అద్భుతంగా తీయొచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటుందీ చిత్రం. సినిమా అనుకున్నప్పటి నుంచి.. పూర్తి అయ్యేవరకు.. ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేవరకు.. సాక్షాత్తూ అయ్యప్ప స్వామి మా వేలు పట్టుకుని నడిపించాడు. ఎక్కడా ఏ ఆటంకం రాకుండా దగ్గరుండి పర్యవేక్షించాడు. ఆయన అనుగ్రహం, ఆశీస్సులతోనే సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. మా హీరో సుమన్ అందించిన సహాయసహకారాలు మరువలేనివి. అలాగే మా దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్ కు ఈ చిత్రం మంచి పేరు తీసుకువస్తుంది... అన్నారు.

ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే: వి.ఎస్.పి తెన్నేటి, సంగీతం: వి.ఎస్.ఎల్.జయకుమార్, నిర్మాతలు: వి.ఎస్.పి తెన్నేటి-టి.ఎస్.బద్రిష్ రామ్, దర్శకత్వం: రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)!!

Veera Sastha Ayyappa Kataksham Producer Interview:

Producer VSP Tenneti Talks about Veera Sastha Ayyappa Kataksham
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs