Advertisement
Google Ads BL

బాలయ్య కోసం బాలీవుడ్ బ్యూటీ వచ్చేస్తోందహో!!


‘సింహా’,‘లెజెండ్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన నటించిందెవరు..? బాలయ్యను ఢీకొట్టేదెవరు..? ఎవరెవరు ఈ సినిమాలో నటిస్తారనే విషయం మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు. బాలయ్య సరసన ఫలానా భామను తీసుకుంటున్నట్లు ఇప్పటికే పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. త్రిష, శ్రియ, అనుష్క, నయనతార ఇలా చాలా పేర్లే తెరపైకి వచ్చాయి. వీళ్లే కాదు.. వేదిక, సోనాల్ చౌహన్‌.. మరీ ముఖ్యంగా మహానటి కీర్తి సురేష్ పేరు రావడం గమనార్హం. అయితే వీళ్లందర్నీ సంప్రదించినప్పటికీ డేట్స్ లేవని కొందరు.. ఇంకొందరు బాలయ్య సరసన మేమా..? అని చెప్పేశారట.

Advertisement
CJ Advs

వాళ్లందర్నీ వదిలేసిన బోయపాటి ఫైనల్‌గా బాలీవుడ్ బ్యూటీని ఫిక్స్ చేశారని తాజాగా పుకార్లు వస్తున్నాయి. వాస్తవానికి గతంలో బాలయ్య సరసన ఇప్పటికే పలు చిత్రాల్లో బాలీవుడ్ భామలు మెరిశారు. అందుకే టాలీవుడ్‌లో దొరక్కపోవడంతో మళ్లీ బాలీవుడ్‌ వైపు అడుగులు పడ్డాయి.! బాలయ్యకు కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆమె ఎంపికే దాదాపు ఖరారు కావొచ్చని సమాచారం. ఇప్పటికే ఆమెను సంప్రదించి స్టోరీ కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కథ మొత్తం విన్నాక రెండ్రోజులు సమయం కావాలని ఆలోచించి చెబుతానని బోయపాటికి రిప్లై ఇచ్చిందట.

మరోవైపు.. ప్రతి నాయకుడి పాత్ర కోసం సంజయ్ దత్‌ను అనుకున్నారని టాక్. ఇటు సోనాక్షి.. అటు సంజయ్‌తో ఇరువురితో సంప్రదింపులు జరపగా.. దత్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇక మిగిలిందల్లా సోనాక్షి మాత్రమేనట. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేకుంటే సింపుల్ రెడ్ సిగ్నల్ వేస్తుందో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతుండగా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Boyapati Srinu story narration to Bollywood Beauty!:

Boyapati Srinu story narration to Bollywood Beauty!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs