ప్రమోషన్స్‌తో పోటీ పడుతున్న అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు మూవీ టీమ్స్ ఇప్పుడు కొత్త ఎత్తుగడలకు తెరలేపుతున్నాయి. సినిమా ప్రమోషన్లో నువ్వా నేనా అంటూ గట్టిగా పోటీ పడుతున్న తరుణంలో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల విడుదల తేదీలు ఒక్క రోజు తేడాలతో ఉండడంతో... సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని జనవరి 5న మహేష్ ఫిక్స్ చేసాడని అంటుంటే.. అల్లు అర్జున్ ఇంకా తేదీ ఫిక్స్ చెయ్యలేదని తెలుస్తోంది. అయితే మహేష్ తన క్లోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్‌ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానిస్తున్నాడని ప్రచారం మొదలయ్యింది.
మరి అల్లు అర్జున్ ఎప్పుడూ సోలోగానే ఈవెంట్స్ ప్లాన్ చేస్తాడు. కానీ ఈసారి మహేష్ పోటీ తట్టుకోవడానికి అల్లు అర్జున్ కూడా మరో స్టార్ హీరోని అల వైకుంఠపురములో సినిమా ప్రీ రిలీజ్‌కి ఆహ్వానించబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్‌తో కలిసి RRRలో నటిస్తూ మెగాభిమానం మూటగట్టుకున్న ఎన్టీఆర్‌ని ఆలా అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ వేడుకకి అతిగా ఫిక్స్ అయ్యారట అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్. అందులోనూ త్రివిక్రమ్, ఎన్టీఆర్‌తో అరవింద సమేత చేసాడు గనక ఎన్టీఆర్ ఈ కోరిక మన్నిస్తాడని, అల్లు అర్జున్ పిలిస్తే ఎన్టీఆర్ ఖచ్చితంగా వస్తాడని అంటున్నారు. అలాగే RRR తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తోనే అంటున్నారు. అలా ఎన్టీఆర్ అల వైకుంఠపురములో ప్రమోషన్స్ లో భాగమవుతాడని మెగా ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అవుతున్నారు. మరి మహేష్‌కి రామ్ చరణ్, అల్లు అర్జున్‌కి ఎన్టీఆర్.. మొత్తానికి సంక్రాంతి ఫిలిమ్స్ ప్రమోషన్స్ రేంజ్ మాములుగా లేదుగా.