Advertisement
Google Ads BL

మహేష్ డ్యాన్స్‌కే అలా అంటే బన్నీతో ఎలా?


టాలీవుడ్‌లో మహేష్, పవన్ కళ్యాణ్‌కి భారీ క్రేజ్ ఉంది. వాళ్ళ హీరోయిజానికి బోలెడంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే మహేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ తమ సినిమాల్లో ఫ్యాన్స్ మెచ్చే డాన్స్ స్టెప్స్ మాత్రం వెయ్యరు. మహేష్ అయినా పవన్ అయినా తూతూ మంత్రంగా డాన్స్ చేసేసి వచ్చేస్తారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పోలిస్తే మహేష్ డ్యాన్స్ జుజుబినే. అలా అంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు కానీ.. మహేష్ డ్యాన్స్ కి మాత్రం అంతంతమాత్రం స్టెప్స్ ఉంటాయి. అలాంటి డ్యాన్స్ కే ఇప్పుడు ఓ హీరోయిన్ భయపడుతుంది. మొదటిసారిగా స్టార్ హీరో అండ్ మహేష్ సినిమాలో నటిస్తున్న రష్మిక‌కి మహేష్ తో స్టెప్స్ వేయాలంటే కంగారు పుడుతుందట.

Advertisement
CJ Advs

ఇప్పటివరకు స్టార్ హీరోల సినిమాల్లో నటించని రష్మిక మొదటిసారి మహేష్‌తో జోడి కట్టింది. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో రష్మిక మహేష్ సరసన నటిస్తుంది. మహేష్ పక్కన రష్మిక లుక్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటిలో మహేష్ ఫ్యాన్స్ కొట్టుమిట్టాడుతున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మొదటిసారి మహేష్ పక్కన ఛాన్స్ కొట్టేసిన రష్మిక.. మహేష్ తో నటించడం గురించి ఇంకా ఎగ్జైట్ అవుతూనే ఉంది. అందులో భాగంగానే రష్మిక..... మహేష్ డ్యాన్స్ మూమెంట్స్‌పై మాట్లాడింది.

మహేష్ బాబు డ్యాన్సులతో తాను సరితూగగలనో లేదో తెలీడం లేదని, అందుకే తన వంతుగా రిహార్సల్స్ మీద ఎక్కువ దృష్టిపెట్టానని చెప్పడంతో.. మహేష్ డ్యాన్స్ లకే ఇలా అంటే ఎలా పాప.. మున్ముందు అల్లు అర్జున్ డ్యాన్స్‌ని తట్టుకోగలవా.. అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి సుకుమార్ - అల్లు అర్జున్ సినిమాలో రశ్మికనే హీరోయిన్ కదా ఆ ఉద్దేశ్యంతో మెగా ఫ్యాన్స్ మాట్లాడుతున్నారన్నమాట. 

Rashmika Mandanna Comments on Mahesh Babu Dance:

Mega Fans Counters on Rashmika Mandanna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs