Advertisement
Google Ads BL

నాగబాబు లేకపోయినా టీఆర్పీలో నో ఛేంజ్!


నాగబాబు జబర్దస్త్‌ వదిలి వెళ్ళిపోతున్నాడు అనగానే మల్లెమాల టీం ఒకింత షాక్‌కి గురైన మాట వాస్తవం. నాగబాబు ప్లాన్ చేసినా.. కమెడియన్స్ వెళ్లకుండా మల్లెమాల టీం ఆపగలిగింది. సామధాన దండోపాయాలను ప్రయోగించి కమెడియన్స్‌ని జారకుండా ఒడిసిపట్టుకుంది. అయితే నాగబాబు వెళ్ళిపోతే జబర్దస్త్ నడవదని, జబర్దస్త్ టీఆర్పీ రేటింగ్ పడిపోవడం ఖాయమనే ప్రచారం మామూలుగా జరగలేదు. అయితే జబర్దస్త్‌ని తలదన్నే షోస్ ని ఎన్ని ఛానల్స్ చేసినా.. జబర్దస్త్ టీఆర్పీ రేటింగ్‌కి ఎలాంటి ఢోకా లేనట్టుగానే రోజా సోలో జడ్జ్‌గా నాగబాబు లేకపోయినా.. ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోకి మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చిందని, జబర్దస్త్ మీద బుల్లితెర ప్రేక్షకులు చూపుతున్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది. గతంలో వచ్చిన టీఆర్పీస్ కన్నా కొద్దిగా తగ్గినా.. పెద్దగా ప్రోబ్లెం లేదంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే నాగబాబు జబర్దస్త్ నుండి బయటికొచ్చి... మల్లెమాలకి చుక్కలు చూపెడదామని డిసైడ్ అయ్యి.. జీ ఛానల్ కి వెళ్లడం, అక్కడ లోకల్ గ్యాంగ్స్ అంటూ హడావిడీ చెయ్యడం తెలిసిందే. అయితే జబర్దస్త్ టీఆర్పీస్‌తో పోలిస్తే... లోకల్ గ్యాంగ్స్‌లో ఎంతగా రచ్చ చేసి అనసూయ అందాలను వాడుకున్నా... లోకల్ గ్యాంగ్స్‌కి అనుకున్న టీఆర్పీ రాలేదని అంటున్నారు. ఇక నాగబాబు తాజాగా జీ ఛానల్‌లో మరో పవర్ ఫుల్ షో అదిరింది అనే షోకి జడ్జ్‌గా చేస్తున్నాడు. తాజాగా అదిరింది ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. మరి నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్లిపోయినా.. రోజా వారానికో జడ్జ్ పక్కన కూర్చుని జబర్దస్త్‌ని జబర్దస్త్‌గా నడిపిస్తుంది.

Without Nagabu No Change in Jabardasth TRP :

Roja Successed to run Jabardasth without Nagababu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs