Advertisement
Google Ads BL

‘వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌’ స్ట్రాట‌జీ అదిరింది


యూనిక్ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ ప్లాన్‌తో ప్రేక్ష‌కుల ముందుకు ‘వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌’

Advertisement
CJ Advs

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడుగా న‌టిస్తోన్న రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘వ‌రల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌’. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఓ షెడ్యూల్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. క్రాంతిమాధ‌వ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వేలంటెన్స్ డే సంద‌ర్భంగా ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చిన విషయం తెలిసిందే. కాగా.. నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించి 4 ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డానికి యూనిట్ ప్లాన్ చేస్తుంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌లుగురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. డిసెంబ‌ర్ 12న ఐశ్వ‌ర్యా రాజేష్‌, 13న ఇజా బెల్లా, 14న క్యాథరిన్ త్రెసా, 15న రాశీఖ‌న్నాల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ల‌ను చేయ‌బోతున్నారు. ఈ నాలుగు ప్ర‌క‌ట‌న‌ల‌ను పైన పేర్కొన్న తేదీల్లో సాయంత్రం 6:03 నిమిషాల‌కే చేస్తారు. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై  కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తోన్న నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ సంగీతం, జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

World Famous Lover does it again - Unique Promotional Strategy to announce their film!:

World Famous Lover Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs