Advertisement
Google Ads BL

కేటీఆర్‌ను కలిసిన ‘ఊల్లాల ఊల్లాల’ చిత్ర బృందం


నటరాజ్, నూరిన్, అంకిత హీరో-హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. సీనియర్ నటుడు ‘సత్య ప్రకాష్’ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయo అవుతుండగా సుఖీభవ మూవీస్ పతాకంపై ఏ. గురురాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ తొలిసారిగా ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రంలో నటించడమే కాక హీరోయిన్ నూరిన్‌కి డబ్బింగ్ చెప్పింది. తను పాడిన ‘రాం రాం’ పాట గురువారం విడుదలకి సిద్ధంగా ఉంది.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా నిర్మాత గురురాజ్ తెలంగాణ ఐ.టి మినిస్టర్ కే.టీ.ఆర్ ని కలిసినప్పుడు, ఆయన నిర్మాత ఏ.గురురాజ్ కి, దర్శకుడు సత్యప్రకాష్ కి, హీరో నటరాజ్ కి, గాయని మంగ్లీకి మరియు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలపడమే కాక సుఖీభవ క్రీయేషన్స్ పతాకంపై నిర్మించే చిత్రాలన్నీ మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. అదే సమయంలో అక్కడే ఉన్న తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రామకృష్ణ గౌడ్‌ని కేటీఆర్, నిర్మాతకి పరిచయం చేయగా, ఆయన కూడా చిత్రానికి తనవంతు సహాయం చేస్తానని, చిత్రం మంచి విజయం సాధించేలా తోడ్పడతానని తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత ఏ. గురురాజ్ మాట్లాడుతూ.. మా బేన‌ర్‌లో ‘ర‌క్ష‌క‌భ‌టుడు’, ‘ఆనందం మ‌ళ్లీ మొద‌లైంది’, ‘ల‌వ‌ర్స్ డే’ చిత్రాల త‌ర్వాత వ‌స్తున్న సినిమా ‘ఊల్లాల ఊల్లాల’. ఇలాంటి కాన్సెప్ట్‌లు చాలా అరుదుగా వ‌స్తుంటాయి. స‌త్య‌ప్ర‌కాశ్‌కి న‌టునిగా ఎంత పేరుందో, ద‌ర్శ‌కునిగా అంత‌క‌న్నా ఎక్కువ పేరు ఈ చిత్రం ద్వారా వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాను. ఈ చిత్రాన్ని జనవరి 1న భారీగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం..’’ అని తెలిపారు.

అదే సమయంలో దర్శకుడు స‌త్య‌ప్ర‌కాశ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను దర్శకునిగా, మా అబ్బాయి నటరాజ్ ను ఈ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాను అని చెప్పగా’’ కేటీఆర్ ‘మీ అబ్బాయి మంచిగా ఎదగాలి.. మీరు దర్శకత్వం  వహిస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలి’ అని చెప్పారు.

Ullala Ullala movie Team meets KTR :

KTR Greetings to Ullala Ullala movie Team
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs