టాలీవుడ్‌లో బిజిబిజీగా గడుపుతున్న హీరో విజయ్‌దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’గా అభిమానుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించే ‘ఫైటర్’ సినిమాలో నటించనున్నాడు. ఈ రెండే కాకుండా శివ నిర్వాణ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా షూటింగ్ దాదాపు అయిపోవస్తుండటంతో పూరీ స్పీడ్ పెంచాడు. ఫాన్ ఇండియా మూవీ కావడంతో అన్నీ పకడ్బందీగానే చేస్తున్నాడు.
సినిమాలో హీరోయిన్‌గా ఎవర్ని తీసుకోవాలి..? కీలక పాత్రల్లోకి ఎవర్ని తీసుకోవాలి..? ఆర్టిస్టులుగా ఎవర్ని తీసుకోవాలి..? అని వెతికే పనిలో నిమగ్నమయ్యాడు. వాస్తవానికి దాదాపు తన సినిమాలకు హీరోయిన్‌గా కొత్త బ్యూటీనే పూరి పట్టుకొస్తాడు. అయితే ‘ఫైటర్’తో రొమాన్స్ చేయించడానికి బాలీవుడ్ హీరోయిన్ అయితే బావుంటుందని భావించిన పూరీ.. సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉన్న కరణ్ జోహర్‌కు ఆ బాధ్యత అప్పగించాడట. ఆయన ఒకరిద్దర్ని కాదు ఏకంగా ముగ్గురు భామలనే లైన్‌లో పెట్టారని సమాచారం.
జాన్వీ కపూర్, సారా అలీఖాన్, ఆలియా భట్ ముగ్గురూ ప్రస్తుతం కాస్త అందుబాటులో ఉన్నారు. వీరిలో ఆలియా భట్‌నే పూరీ, కరణ్ ఫిక్స్ అయ్యారని సమాచారం. ఎందుకుంటే ఆలియా డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో దాదాపు ఆమెనే ఫిక్స్ చేయాలని పూరీ కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. భారీ బడ్జెట్‌తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR మూవీలో రామ్ చరణ్ సరసన ఈ భామ నటించింది. ఇప్పటికే షూటింగ్ కోసం పూర్తి చేసుకున్న ఆలియా ప్రస్తుతం ఇంకా డేట్స్ ఇవ్వలేదు. కరుణ్ సంప్రదించడంతో మారుమాట చెప్పకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అయితే విజయ్-ఆలియా కాంబో ఏ మాత్రం వర్కవుట్ అవుతోందో.. లేదో..? అసలు ఇందులో ఏ మాత్రం నిజముంది..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచిచూడాల్సిందే.