Advertisement
Google Ads BL

టాలీవుడ్ టాప్ హీరోతో శంకర్ భారీ చిత్రం!


దక్షిణాదిలోనే కాదు తన సినిమాలతో యావత్ ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శంకర్. అంతేకాదు.. భారీ బడ్జెట్‌తో భారీ చిత్రాలను తెరకెక్కించే దర్శకుల్లోనూ శంకర్ ముందు వరుసలో ఉంటారు. ఈయనతో ఏ హీరో అయినా ఒక్క సినిమా చేశారంటే ఆయన పేరు.. రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందంతే. అందుకే ఈయన రెండేళ్లకు.. మూడేళ్లకోసారి సినిమాలు తెరకెక్కించినా చాలా పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు తీస్తుంటారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్-శంకర్ కాంబోలే సినిమాలే ఇందుకు చక్కటి ఉదాహరణ.

Advertisement
CJ Advs

ఇక అసలు పాయింట్‌కు వస్తే.. ఇప్పటి వరకూ పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసేసిన శంకర్.. టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఓ వెలుగు వెలుగుతూ భారీ చిత్రాలకే మొగ్గు చూపుతున్న యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌పై ఆయన కన్ను పడింది. డార్లింగ్ కోసం శంకర్ ఓ పవర్‌ఫుల్ స్టోరీని సిద్ధం చేశారని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే ఆ స్టోరీ కూడా ప్రభాస్‌కు క్రేజ్‌ను మరింత పెంచే రీతిలోనే ఉంటుందట. ఇదివరకే స్టోరీ లైన్‌న్‌ను సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కథ చెప్పారట. కథ నచ్చగానే ఏ మాత్రం ఆలస్యం చేయని దిల్ రాజు.. డార్లింగ్‌తో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇదీ స్టోరీ లైన్ అని చెప్పేశాడట. ‘నువ్ చెప్పాక ఇక అడ్డేముంది డార్లింగ్ చేసేద్దాం’ అని ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. మొత్తానికి చూస్తే టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి శంకర్‌కు మార్గం సుగుమమైందన్న మాట.

కాగా.. ప్రస్తుతం ‘జాన్’ సినిమాతో ప్రభాస్ బిజీబిజీగా ఉండగా.. శంకర్ కూడా ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు-2’లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు అవ్వగానే ప్రాజెక్టు‌ను పట్టాలెక్కించాలని దిల్ రాజు-శంకర్ ఓ మాట అనేసుకున్నారట. వాస్తవానికి భారతీయుడు సినిమా అవ్వగానే తమిళంలో స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్‌తో మూవీ చేయాలని శంకర్ భావించారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ స్టోరీ ఆయనకు కాకుండా ప్రభాస్‌కు అయితే బాగుంటుందని ఈయనతో తెరకెక్కించాలని శంకర్ అనుకున్నారా..? లేకుంటే డార్లింగ్ కోసం కొత్త కథ ఏదైనా సిద్ధం చేశారా..? అసలు ఈ వార్తలో నిజానిజాలెంత..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

Top Director Shankar Movie With Tollywood Star Hero.. Details Here..:

Top Director Shankar Movie With Tollywood Star Hero.. Details Here..  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs