Advertisement
Google Ads BL

దేవిశ్రీ విషయంలో సుక్కు కూడా ఆలోచిస్తున్నాడా?


దేవిశ్రీ ప్రసాద్ ఈమధ్యన కాస్త డల్ అయిన మాట వాస్తవం, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవి ఈ మధ్యన ఎందుకో కొత్త ట్యూన్స్ కట్టడానికి ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు మ్యూజిక్ విషయంలో మహేష్ ఫ్యాన్స్ బాగా వర్రీ అవుతున్నారు. రెండు మండేలు విడుదలైన సరిలేరు నీకెవ్వరు రెండు సాంగ్స్ అంతగా ఎక్కడం లేదు. అందులోను అల వైకుంఠపురములో సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యేసరికి మహేష్ సరిలేరు సాంగ్స్ వాటిముందు తేలిపోతున్నాయి. లేదంటే సూర్యుడివో చంద్రుడివో సాంగ్ లిరిక్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ అల కొచ్చిన హైప్ ముందు దేవిశ్రీ సరిలేరుకి ఇచ్చిన మ్యూజిక్ ఆనడం లేదు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు సుకుమార్, దేవిశ్రీ మ్యూజిక్ మీద అసంతృప్తిగా ఉన్నాడని, అల్లు అర్జున్ తో చెయ్యబోయే సినిమా విషయంలో దేవిశ్రీ ఇచ్చే మ్యూజిక్ విషయంలో సుక్కు మదనపడుతున్నట్టుగా ఫిలింనగర్ న్యూస్. ఇప్పటికే కొరటాల శివ తనకిష్టమైన దేవిశ్రీని పక్కనబెట్టి చిరు సినిమా కోసం మణిశర్మని తీసుకున్నాడు. ఇప్పుడు సుకుమార్ కూడా దేవిశ్రీ విషయంలో పునరాలోచన చేస్తాడనే టాక్ మెగా ఫ్యాన్స్ మదిలో మొదులుతుంది. అలాగే అల్లు అర్జున్ కూడా మ్యూజిక్ విషయంలో తేడా వస్తే ఊరుకునే రకం కాదు. అందుకే సుకుమార్ దేవిశ్రీని మ్యూజిక్ పర్ఫెక్ట్ గా లేకపోతే కష్టమని అల్టిమేటం జారీ చేసినట్టుగా టాక్.

Sukumar Thinking About DSP for Allu Arjun Film:

Sukumar Changed his Music Director for Bunny Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs