Advertisement
Google Ads BL

ప్రభాస్ కోసం బాలీవుడ్ స్కెచ్.. ఫ్యాన్స్‌కి పండగే!


ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై బాహుబలి విడుదలైన దగ్గర నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ప్రభాస్ మాత్రం ధైర్యం చేయలేకపోతున్నాడు. బాహుబలితో పిచ్చ క్రేజ్ సంపాదించిన ప్రభాస్ కి సాహో సౌత్ లో దెబ్బేసిన బాలీవుడ్ లో బ్రతికించింది. కేవలం బాహుబలి మ్యానియా సాహోకి పనిచేసింది. ప్రస్తుతం జాన్ సినిమాని కూడా నాలుగైదు భాషల్లో దించుతున్నాడు. సాహో తర్వాత జాన్ సినిమాని కాస్త ఆచి తూచి చేస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రభాస్ తో మూవీ ప్లాన్ చేస్తున్నట్టుగా బాలీవుడ్ టాక్.

Advertisement
CJ Advs

ధూమ్ సీరీస్ తో అదరగొట్టిన యష్ రాజ్ ఫిలిమ్స్ రీసెంట్ గా వార్ సినిమాతో హిట్ కొట్టారు. ధూమ్ సిరీస్ మొత్తం హిట్ కావడంతో.. యష్ రాజ్ ఫిలిమ్స్ ఇప్పుడు ధూమ్ 4 కి సన్నాహాలు మొదలెట్టింది. అయితే ధూమ్ సీరీస్ లో నటించిన హీరోలను కాకుండా ఇప్పుడు కొత్త హీరోని ధూమ్ 4 కోసం చూస్తున్నారట. బాహుబలి, సాహోతో బాలీవుడ్ ని షేక్ చేసిన ప్రభాస్ ని గనక ధూమ్ 4 లో నటింప జేస్తే సౌత్ లోను సినిమాకి క్రేజ్ వస్తుంది. అలాగే బాలీవుడ్ కి బావుంటుందని అనుకుంటున్నారని వినికిడి. ఒకవేళ యష్ రాజ్ ఫిలిమ్స్ నిజంగా ప్రభాస్ ని కాంటాక్ట్ చేస్తే అది ప్రభాస్ కి కాదు ఆయన ఫ్యాన్స్ కి పండగే. ఎందుకంటే ధూమ్ సీరీస్ మూవీస్ అంటే ప్రేక్షకుల్లో పిచ్చ క్రేజ్ ఉంది. అలా ప్రభాస్ పక్కాగా ధూమ్ 4 తో బాలీవుడ్ లో సక్సెస్ అవుతాడన్నమాట.

Yash Raj Films Banner plans Movie with Prabhas :

Young Rebel Star Prabhas in Dhoom 4
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs