Advertisement
Google Ads BL

‘నో’ నేను ఆ పాత్రలో నటించలేను: రష్మిక


సినీ ఇండస్ట్రీలో నటీనటులపై వార్తలకు కొదువ ఉండదన్న విషయం తెలిసిందే. కొందరు సోర్స్‌లు తెలుసుకుని దాన్ని గాసిప్స్‌గా రాసేస్తారు.. మరికొందరేమో అదే పనిగా పుకార్లు పుట్టిస్తుంటారు. ఏ క్షణాన తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో కానీ సినిమా అవకాశాలకు మాత్రం అస్సలు కొదవలేదు. అలా వరుస సినిమాలు రావడంతో ఈ భామకు కొమ్ములొచ్చాయో ఏమోగానీ పెద్ద పెద్ద సినిమాలకు నో చెప్పేస్తోందట. ఇందుకు ఓ బలమైన కారణం ఉందట. వరుస సినిమాలు రావడం.. సినిమాలన్నీ హిట్టవ్వడంతో ఈ ముద్దుగుమ్మ భారీగానే పారితోషికం పెంచేసిందట.

Advertisement
CJ Advs

తాజాగా యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న రష్మిక గురించి ఓ పుకారు టాలీవుడ్‌లో షికారు చేస్తోంది. తెలుగులో సూపర్ డూపర్ హిట్టయిన ‘జెర్సీ’ హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరే హిందీలో కూడా తెరకెక్కిస్తున్నాడు. ఈ రీమేక్‌లో హీరోగా షాహిద్ దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే షాహీద్ సరసన నటించాలని రష్మిక మందన్నాను కోరగా.. కథ చెప్పాలని కోరిందట. కథ మొత్తం విన్నాక రెమ్యునరేషన్ సంగతేంటి..? అని దర్శకనిర్మాతలను ఈమే క్వశ్చన్ చేసిందట.

అయితే ఆ పారితోషికం కూడా గట్టిగానే అడిగిందట. కాస్త తగ్గించుకోండి మేడమ్ అని అడిగినప్పటికీ తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేసిందట. ఫైనల్‌గా ఓ ఫిగర్‌కు దర్శకనిర్మాతలు రాగా.. నో అస్సలు కుదరదని ఈ బ్యూటీ చెప్పేసిందని పుకార్లు పెద్ద ఎత్తున వస్తున్నాయ్. అయితే ఈ వ్యవహారంపై తాజాగా ఆ భామ మాట్లాడుతూ.. అబ్బే పారితోషికం విషయం కాదని.. అంతటి బరువైన పాత్రకి తాను న్యాయం చేయలేనేమోనని ఉద్దేశంతోనే అంగీకరించలేదని స్పష్టం చేసింది. మంచి పాత్రలు వస్తే మాత్రం పారితోషికంతో ఎప్పుడూ ముడిపెట్టనని తనపై వస్తున్న పుకార్లపై రష్మిక క్లారిటీ ఇచ్చుకుంది.

Rashmika Mandanna Gives Clarity On Key Role.. In Big Movie.. Here is her response:

Rashmika Mandanna Gives Clarity On Key Role.. In Big Movie.. Here is her response  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs