Advertisement
Google Ads BL

బాలయ్యకి ‘మహానటి’ ఝలక్..!!


బాలకృష్ణకే కాదు.. నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ ఇలా సీనియర్ హీరోలందరికీ హీరోయిన్స్ కొరత టాలీవుడ్ ని పట్టి పీడిస్తుంది. సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్స్ వెతుకులాటకే దర్శకుడికి సగం టైం సరిపోతుంది. చిరు - కొరటాల సినిమాకి చిరు కోసం హీరోయిన్స్ వేటలోనే ఉన్నాడు కొరటాల. త్రిష అన్నారు ఫైనల్ కాలేదు. ఇక వెంకీ అసురన్ కోసం శ్రియ అంటున్నారు. మరోపక్క నాగ్ కొత్త సినిమాకి హీరోయిన్ కొరత. తాజాగా బాలయ్య - బోయపాటి సినిమాకి హీరోయిన్స్ దొరకడం లేదు. అనుష్క, నయనతార లాంటి వాళ్ళు పారితోషకాలతో బెదరగొడుతున్నారు. తాజాగా బాలయ్యకి హీరోయిన్స్ కొరత ఏ రేంజ్ లో ఉందో.. రూలర్ సినిమా హీరోయిన్స్ చూస్తే తెలుస్తుంది. రూలర్లో వేదిక, సోనాల్ చౌహన్ లు ఫేడవుట్ హీరోయిన్స్.. అయినా బాలయ్యకి తప్పలేదు.

Advertisement
CJ Advs

తాజాగా బోయపాటి సినిమాలో బాలకృష్ణ సరసన మహానటి కీర్తి సురేష్ ని బోయపాటి సంప్రదించడం కథ వినిపించడం జరిగింది. కీర్తి సురేష్ కూడా ఓకే  చెప్పినట్లుగా వార్తలొచ్చాయి. కానీ తాజాగా డేట్స్ ప్రాబ్లమ్... లేదంటే సీనియర్ హీరోలతో చేస్తే స్టార్ హీరోస్ మూవీస్ ఛాన్స్ రావనుకుందో.. బాలకృష్ణ సినిమాకి కీర్తి సురేష్ నో చెప్పిందనే న్యూస్ నడుస్తుంది. కీర్తి సురేష్ కాదనడంతో.. బోయపాటి మళ్ళీ హీరోయిన్ వెతుకులాట మొదలెట్టాడట. మరి చివరికి బోయపాటి, బాలయ్యల లక్కీ హీరోయిన్ నయనతారే ఫైనల్ అవ్వొచ్చని, కానీ నయన్ తో పెట్టుకుంటే బడ్జెట్ మరింత పెరుగుతుందని ఆలోచిస్తున్నారట. 

One More Heroine Jhalak to Balayya:

Keerthi Suresh says no to Balakrishna Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs