పవన్ కళ్యాణ్ రాజకీయాల వెంట పడి సినిమా ప్రపంచాన్ని నెగ్లెట్ చెయ్యడం లేదు. కానీ ఆయన మళ్ళీ రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో అనే దాని మీద ఆయన ఫ్యాన్స్ కి కూడా క్లారిటీ లేదు. రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ చిన్న చిన్న సినిమాల టీజర్స్ నో, ట్రైలర్స్ నో విడుదల చేస్తూ.. హడావిడి చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో మళ్ళీ గ్రాండ్ గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరగడం కాదు టాప్ ప్రొడ్యూసర్స్ కన్ఫర్మ్ చేశారు. కానీ ఇంకా ఆ సినిమా విషయాలేమి అధికారికంగా బయటికైతే రాలేదు. పవన్ కళ్యాణ్ - దిల్ రాజు కాంబోలో పింక్ రీమేక్ పక్కా అనేది వాస్తవం కానీ ఎప్పుడనేది ఎవరికీ అంతుబట్టని ప్రశ్న.
అయితే ఈ పింక్ రీమేక్ లో పవన్ సరసన పూజాహెగ్డే అయితే బావుంటుందని ఆనుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతం పూజా ఫామ్ లో ఉంది గనక. అయితే తాజాగా పింక్ లో అదరగొట్టిన తాప్సి పాత్రకి అక్కినేని కోడలు సమంత అయితే కరెక్ట్ అని, స్టార్ హీరోల సినిమాలు లేకపోయినా సమంత ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ కాబట్టి సమంత అయితే తాప్సి పాత్రకి న్యాయం చేకూర్చుతుంది అని దిల్ రాజు భావిస్తున్నాడట. ఇప్పటికే దిల్ రాజు సమంతతో 96 రీమేక్ చేసాడు. తాజాగా పింక్ రీమేక్ కూడా సమంతతో చేయించాలని దిల్ రాజు డిసైడ్ అయ్యాడట.