అల్లు అరవింద్ తో సినిమా అంటే దర్శకులు ఆచి తూచి ఖర్చు పెడతారు. అందుకే అల్లు అరవింద్ అంత పెద్ద నిర్మాతగా ఎదిగారు. బడ్జెట్ ని కంట్రోల్ పెట్టడం అంటే అరవింద్ తరవాతే ఎవరైనా అంటుంటారు. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ కూడా తన కొడుకు అల వైకుంఠపురములో సినిమా బడ్జెట్ విషయంలో ఏం చెయ్యలేకపోయాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. త్రివిక్రమ్ అనుబంధ నిర్మాతలు హారిక హాసిని వారితో కలిసి అరవింద్ అల వైకుంఠపురములో సినిమాని నిర్మిస్తున్నాడు. హారిక హాసిని వారు త్రివిక్రమ్ ఎక్కడ పొయ్యమంటే అక్కడ డబ్బు పోసే రకాలు. కానీ అరవింద్ అలా కాదు... అయినప్పటికీ.. త్రివిక్రమ్, అరవింద్ ఆలోచనలకూ అందనంతగా అలకి బడ్జెట్ పెట్టించాడని అంటున్నారు.
సినిమాకి అనుకున్న బడ్జెట్ ఒకటైతే. ఇప్పుడు అయ్యింది మరొకటి అని అంటున్నారు. అయితే సినిమాకొచ్చిన హైప్ ముందు బడ్జెట్ లెక్క ఓ లెక్క కాదని అంటున్నప్పటికీ... థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపితే వచ్చే లాభాలను హారిక హాసిని నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ పంచుకోవాలి కాబట్టి... ఆ లాభాలు స్వల్పంగానే ఉంటాయని అంటున్నారు. అయితే త్రివిక్రమ్ సామజవరగమన పాట హిట్ కావడం, సినిమాకి భారీ క్రేజ్ రావడంతో.. తర్వాత తెరకెక్కించాల్సిన పాటల విషయంలో బడ్జెట్ పెంచుకుంటూ పోయాడట. ఇక అరవింద్ కూడా త్రివిక్రమ్ చెప్పినట్లే చెయ్యాల్సి వచ్చిదనే టాక్ నడుస్తుంది.