Advertisement
Google Ads BL

‘సరిలేరు నీకెవ్వరు’ సెకండ్ సాంగ్ సూపర్బ్!


సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో...సారథివో వారధివో మా ఊపిరి కన్నకలవో.. సోల్‌ఫుల్‌ మెలోడీతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’

Advertisement
CJ Advs

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌  ‘సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతికి రానున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, ఫస్ట్‌ సాంగ్‌ మైండ్‌ బ్లాక్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ రాగా ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్న సెకండ్‌ సాంగ్‌,  సోమవారం సాయంత్రం 5:04 కి విడుదలైంది. ‘సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో...సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో.. విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో... సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో’ అనే పల్లవితో సాగే ఈ పాట వినసొంపైన ఫ్యామిలీమెలోడీగా ఉంది. ఎమోషనల్‌గా సాగుతూనే సినిమాలోని ప్రధాన పాత్రల భావోద్వేగాలను చాలా బలంగా ఎస్టాబ్లిష్‌ చేస్తోంది. ముఖ్యంగా చిత్రీకరణ సందర్భంగా పలు సన్నివేశాలలో రూపొందించిన వీడియో, మహేష్ బాబు, విజయశాంతి మధ్య వచ్చే సీన్లు, సెట్లో టీమ్ చేసే సందడి అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన ట్యూన్‌తో సాంగ్‌ను చక్కగా తీర్చిదిద్దారు. ఎన్నో మెలోడీ సాంగ్స్‌ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్‌ చేసిన మరో సూపర్‌ మెలోడీ సాంగ్‌ ఇది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ క్లాసీ సాంగ్‌ లిరిక్స్‌ అర్థవంతంగా ఉన్నాయి.  ప్రముఖ పంజాబీ సింగర్‌, కంపోజర్ బి. ప్రాక్‌ గానం ఫ్రెష్‌ ఫీల్‌ను కలిగిస్తుంది.

‘సరిలేరు నీకెవ్వరు’ టీం అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఒక స్ట్రాటజీ ప్రకారం పాటలని విడుదల చేస్తూ ప్రమోట్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. ‘సూర్యుడివో చంద్రుడివో’ పాటతో ఆల్‌ మాస్‌, క్లాస్‌ ఆడియన్స్‌, సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కి ఫీస్ట్‌ గా సంక్రాంతి ఎంటర్టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ ఉండబోతోంది అని తెలుస్తోంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిస్తున్న ఈ మాస్‌ ఎంటర్టైనర్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ క్యారక్టరైజేషన్‌, కామెడీ టైమింగ్‌ హైలైట్స్‌గా ఉండనున్నాయి. జనవరి 11, 2020న  ప్రపంచవ్యాప్తంగా ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల కానుంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Click Here For Song

Soulful Melody Song From Superstar Mahesh’s ‘Sarileru Neekevvaru’ Is Out:

Superb Response to Sarileru Neekevvaru Second song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs