Advertisement
Google Ads BL

అభిమాని ఫ్యామిలీకి చరణ్ రూ. 10 లక్షల సాయం


నూర్ మొహ్మద్ కుటుంబానికి రూ. పది లక్షలు ప్రకటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 

Advertisement
CJ Advs

గ్రేటర్‌ హైదరాబాద్‌ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్‌ మొహ్మద్‌ ఆకస్మిక మరణవార్తకు ‘మెగా’కుటుంబం వెంటనే స్పందించింది. విషయం తెలియగానే మెగాస్టార్‌ చిరంజీవి నూర్‌ మొహ్మద్‌ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ అందుబాటులో లేకపోవడంతో నిన్న వెళ్ళలేకపోయారు. కొద్దిసేపటి క్రితం రామ్‌చరణ్‌ ఒక ప్రకటన చేస్తూ తాను హైదరాబాద్‌ రాగానే నూర్‌ మొహ్మద్‌ కుటుంబాన్నికలుస్తానని తెలిపారు. నూర్‌ మొహ్మద్‌ కుటుంబానికి రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు.

‘నూర్‌ మొహ్మద్‌‌గారు మెగా అభిమానులందరిలోకెల్లా గొప్ప వ్యక్తి. ఆయన మా పేరు మీద ఎన్నో పర్యాయాలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేశారు. ఆయన లేని లోటు తీరనిది. గతంలో ఒకసారి ఆయన హాస్పిటల్‌లో ఉన్నపుడు నేను స్వయంగా ఆ హాస్పిటల్‌కు వెళ్ళి పరామర్శించి వచ్చాను. అక్కడి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం చేయించాను. నిన్న ఆయన మరణవార్త విన్న వెంటనే చలించిపోయాను. ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అన్నారు. మెగా బ్లడ్‌ బ్రదర్‌ నూర్‌ మొహ్మద్‌ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని సంతాపాన్ని ప్రకటించారు.

Ram Charan Announces Rs. 10 Lakh to Noor Mohammmad Family:

Ram Charan Helps His Family fan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs