Advertisement
Google Ads BL

చైతూ చించేసాడు.. గర్వంగా ఉంది: వెంకటేష్


వెంకీ మామ ప్రీ రిలీజ్ వేడుక ఖమ్మంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులు కూడా చాలా మంది హాజరయ్యారు.. ఆ విశేషాలు

Advertisement
CJ Advs

ఈ కార్యక్రమంలో హీరో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. సౌండ్ ఏంటి.. ఈ ఖమ్మం సౌండ్ అంటే అంతేగా అంతేగా.. మాటలు కాదు వణుకులే. చాలా ఆనందంగా ఉంది.. మా ప్రీ రిలీజ్ ట్రైలర్ వేడుకకు ఇక్కడికి రావడం. ఈ సినిమాలో చైతూకు మాత్రమే మామ.. కానీ విడుదల తర్వాత అందరికీ వెంకీ మామనే. ఎక్కడికి వెళ్లినా కూడా వెంకీ మామ అంటున్నారు. మా సురేష్ ప్రొడక్షన్స్‌లో చైతూ తొలిసారి చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతూ చించేసాడు.. చించేసాడు.. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ మామకు ఇంకేం కావాలి చెప్పండి. ముందు నుంచే ఈ సినిమా బాగా వచ్చింది.. మంచి కథ తెచ్చుకున్నాం.. అందరం కష్టపడి సూపర్ హిట్ చేస్తున్నామని కష్టపడి పని చేసాం. టెక్నీషియన్స్ అంతా కష్టపడ్డారు. థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా దర్శకుడు బాబీ ఈ సినిమాను అద్భుతంగా తీసి మామ అల్లుడు సెంటిమెంట్ టెర్రిఫిక్‌గా తీసాడు. చాలా థ్యాంక్స్ బాబీ.. అద్భుతమైన సినిమా ఇచ్చావు.. అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంటికెళ్లాలి.. లేదంటే నాకు టెన్షన్ వస్తుంది. ఈ సినిమాలో ఇందాక మీరు వినుంటారు పాటలో అమ్మైనా నాన్నైనా నువ్వేలే నువ్వే వెంకీ మామ. నాకు అంతా ఫ్యాన్స్.. నా 30 ఏళ్ల కెరీర్‌లో మీరే నా బలం.. ఖమ్మంలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు థ్యాంక్స్. అక్కడికి రావాలని ఉంది కానీ రాలేను కదా. థ్యాంక్ యూ సో మచ్.. డిసెంబర్ 13న కలుద్దాం అని తెలిపారు.

హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.. మా విక్టరీ వెంకీ మామ అభిమానులందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులంతా బాగున్నారా.. చాలా సంతోషంగా ఉంది కలవడం. పైగా ఖమ్మంలో కలవడం ఇంకా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా స్పెషల్.. ఐ లవ్ యూ ఆల్ ఖమ్మం. నా లైఫ్‌లో రెండే రెండు సినిమాలు మనం, వెంకీ మామ మెమోరీస్. కెమెరా వెనక ఓ మామ.. ముందు మరో మామ.. నన్నెంత బాగా చూసుకున్నారో. ఇద్దరు మామయ్యలు చాలా బాగా చూసుకున్నారు. రేపు విడుదలైన తర్వాత క్రెడిట్ అంతా వాళ్లదే. కూల్ డైరెక్టర్ బాబీకి థ్యాంక్స్. కొందరు కమర్షియల్ ఎలిమెంట్స్.. కొందరు కంటెంట్ పట్టుకుని సినిమా చేస్తారు. కానీ బాబీ రెండు కలిపి కొట్టాడు. చాలా మంది దర్శకులు లవ్ స్టోరీ చేస్తే ఈయన మిలటరీ చేసాడు. హీరోయిన్స్ రాశీ, పాయల్ కూడా చాలా బాగా నటించారు. రాశీ తెలుగులో తొలి సినిమా మనం.. చిన్న రోల్ చేసింది. నువ్వు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం. పాయల్‌తో మంచి ఎంటర్టైనింగ్ ట్రాక్ ఉంది. థమన్ ఇవ్వాల మిస్ అయ్యాడు.. కానీ ఆయన రాక్ స్టార్. ప్రతీ ఏడాది ఫ్రెష్ సౌండ్‌తో వస్తున్నాడు. టెక్నికల్ టీం అంతా అద్భుతంగా పని చేసారు. అందరికీ థ్యాంక్యూ.. ట్రైలర్ బాగుంది కదా.. అల్లరి అల్లరిగా ఉంది కదా.. మామా అల్లుళ్లు అల్లరి మామూలుగా ఉండదు.. చాలా జాగ్రత్తగా ఇంటికెళ్లండి.. ఖమ్మం పోలీస్.. శ్రేయాస్ మీడియాకు థ్యాంక్స్.. అని తెలిపారు.

దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. నమస్కారం ఖమ్మం.. ముందుగా ఇక్కడికి వచ్చిన వెంకటేష్, నాగ చైతన్య అభిమానులకు.. మెగా, నందమూరి, ఘట్టమనేని అభిమానులకు అందరికీ నమస్కారం. అందరి అభిమానులకు ఎందుకు చెప్తున్నానంటే ఏ హీరో అభిమానులు కూడా నెగిటివ్ మాట్లాడని హీరో వెంకటేష్‌గారు. సినిమా చేసిన తర్వాత కూడా ఆ రిలేషన్ మెయింటేన్ చేయడం గొప్ప విషయం సర్. మహేష్ బాబు గారిని తమ్ముడిలా చూసుకుంటారు. వరుణ్ వచ్చి భోజనం చేస్తాడు. పవన్ గారితో ఫ్రెండ్ షిప్ ఉంటుంది. ఈ సినిమా నాకు కష్టపడితే వచ్చింది. చిన్నపుడు వీసీఆర్ కోసం వెళ్తే సీడీలు దొరికేవి కావు.. ఎవరో ఒకరు ఆడవాళ్లు తీసుకుని వెళ్లేవాళ్లు. బ్లాక్‌లో తీసుకుని రావాల్సి వచ్చింది. మీతో సినిమా చేసినపుడు నేను చాలా నేర్చుకున్నాను. ఎఫ్2లో వెంకటేష్ గారి ఫన్ చూసారు.. కానీ ఈ సినిమాలో వెంకటేష్ గారి మాస్ యాంగిల్ చూపించాను. ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా చైతూ కొత్త హీరోగానే ఆలోచిస్తాడు.. ఇదే ఫస్ట్ సినిమాలా చూస్తాడు.. ఇది కెరీర్‌కు ఇంపార్టెంట్ అన్నట్లుంటాడు. సురేష్ బాబు గారు పెద్ద పుస్తకం.. ఆయన గురించి చెప్పడం కష్టం. చాలా మంది నిర్మాతలతో పనిచేసాను సర్.. అన్నీ బాగా వచ్చినయ్ సర్.. మెయిన్ ఆర్టిస్టులు లేని సీన్ కొరత కనిపించింది. అక్కడ ఎవరూ లేరు.. క్రౌడ్ ఉండి నాజర్ గారి లాంటి కారెక్టర్ ఆర్టిస్టు ఉన్నారు.. అలాంటి సీన్ రీ షూట్ చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు నెక్ట్స్ సినిమా చేయాలంటే భయంగా ఉంది.. మీ స్కూల్, మీ రైటింగ్ నాకు గుణపాఠం సర్. హీరోయిన్లు బాగా చేసారు. రాశీ ఖన్నా బాగా చేసింది. పాయల్ ఆర్ఎక్స్ 100 మాదిరే హై లో ఉంటుంది. టెక్నికల్ టీం చాలా బాగున్నారు. ప్రసాద్ అన్నా సినిమాటోగ్రఫీ బాగుంది. థమన్ బ్యాగ్రౌండ్ బాగుంది.. బ్రహ్మ గారూ ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగా చేసారు. శ్రీకాంత్ విసా స్క్రిప్ట్‌లో హెల్ప్ చేసాడు. నా రైటింగ్ టీం స్పెషల్ మెన్షన్.. ఈ సినిమాను నాకు తీసుకొచ్చిన నా గురువు కోన వెంకట్ థ్యాంక్స్.. సింగర్స్, లిరిసిస్టులు అందరికీ థ్యాంక్స్.. అని తెలిపారు.

హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ఖమ్మం ఎలా ఉన్నారు.. నేను ఫస్ట్ టైమ్ ఖమ్మంకు వచ్చాను. ఇంత పెద్ద క్రౌడ్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీ లవ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. వెంకీ మామ నాకు చాలా స్పెషల్. వెంకీ గారితోనే కాదు చైతూతో కూడా ఫస్ట్ సినిమా ఇది. నేను కూడా మీ లాగే వెంకటేష్ గారికి పెద్ద ఫ్యాన్. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను.. సినిమాల గురించి లైఫ్ గురించి నేర్చుకున్నాను. బాబీ గారితో రెండోసారి పని చేస్తున్నాను జై లవకుశ తర్వాత. సురేష్ ప్రొడక్షన్స్‌కు కూడా చాలా థ్యాంక్స్.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి కూడా థ్యాంక్స్. ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. పాయల్ రాజ్‌పుత్‌తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 13న విడుదల కానుంది.. వచ్చి ఆశీర్వదించండి.. అని తెలిపారు.

హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఖమ్మం.. నేను రెండోసారి ఖమ్మంకు వచ్చాను. మీడియా వాళ్లందరికీ థ్యాంక్స్.. ఈ రోజు చాలా ఎగ్జైటెడ్‌గా.. ఆనందంగా ఉంది. ఈ సినిమాకు నాకు చాలా స్పెషల్.. దానికి కారణం వెంకటేష్ గారూ. ఐ లవ్ యూ.. నేను మీకు పెద్ద ఫ్యాన్. మీతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది.. ఇంత త్వరగా మీతో పని చేస్తానని అనుకోలేదు.. కల నిజమైనట్లు ఉంది.. వెంకీ మామ ఫస్ట్ డే షూట్‌లో చాలా కంగారు పడ్డాను.. కానీ వెంకటేష్ గారు నన్ను ఫ్రీ అయ్యేలా చేసారు. ఇందులో హిందీ టీచర్‌గా నటిస్తున్నాను.. అని తెలిపారు.

నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రెండేళ్ల జర్నీ ఇది. ఇలాంటి సందర్భంగా వెంకటేష్, నాగ చైతన్య లాంటి హీరోలతో గ్రేట్ మల్టీస్టారర్ ప్రొడ్యూస్ చేయడం ఆనందంగా ఉంది. డిసెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. చూసి ఎంజాయ్ చేయండి.. అని తెలిపారు.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.. ఖమ్మం ప్రజలకు థ్యాంక్స్.. ప్రెస్ మీట్‌లలో అయితే ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ మాట్లాడటం రాదు.. రాజకీయ నాయకులు అయితే బాగా మాట్లాడతారు.. మా సినిమా డిసెంబర్ 13న విడుదలవుతుంది.. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న మంచి సినిమా అవుతుంది. గ్రేట్ యాక్షన్.. సెంటిమెంట్.. ఎంటర్‌టైన్మెంట్ ఉన్న సినిమా ఇది... అని తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ.. మా సినిమాలో అన్నీ ఉంటాయి.. డిసెంబర్ 13న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం.. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.. ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఎమోషన్స్ అన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి. దర్శకుడు బాబీ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. వెంకటేష్, నాగ చైతన్య నటన మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. డిసెంబర్ 13న వస్తున్న మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Venky Mama Pre Release Event Highlights:

Celebrities speech at Venky Mama Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs