Advertisement
Google Ads BL

‘ప్రతిరోజూ..’ టీమ్ డిఫరెంట్‌ ప్రమోషన్!


క్రిస్టమస్ సినిమాల హడావిడి మొదలైపోయింది. వచ్చే వారం విడుదల కానున్న వెంకీమామ క్విక్ ప్రమోషన్స్ అంటూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్ అంటూ హడావిడి చేస్తుంటే.. క్రిస్టమస్ కానుకగా అంటే డిసెంబర్ 20 న విడుదల కాబోతున్న రూలర్, ప్రతిరోజు పండగే సినిమాలు టీజర్, ట్రైలర్ తో హడావిడి చేస్తున్నాయి. ఇక క్రిస్టమస్ రోజు డిసెంబర్ 25 న విడుదల కాబోతున్న దిల్ రాజు ఇద్దరి లోకం ఒకటే ఇంకా పోస్టర్స్ తోనే తప్ప మరో హడావిడి కనిపించడం లేదు. ఇక అనూహ్యంగా రేసులోకొచ్చిన కీరవాణి కుమారుడు నటించిన చిన్న సినిమా మత్తువదలరా కూడా డిసెంబర్ 25 నే విడుదల అంటూ హంగామా మొదలెట్టడమే కాదు. టీజర్ ని రామ్ చరణ్ తో విడుదల చేయించి సినిమా మీద హైప్ లేపింది చిత్ర బృందం.

Advertisement
CJ Advs

రూలర్ ట్రైలర్ ఈ రోజు విడుదల కాగా... ప్రతిరోజు పండగ మాత్రం ప్రీ రిలీజ్ టూర్ అంటూ ఊర్ల వెంట పడింది. సాయి ధరమ్ తేజ్ - మారుతీ, హీరోయిన్ రాశి సినిమాలోని ఇతర నటులు కలిసి ప్రతిరోజు పండగే రోడ్ షోస్ చేస్తూ భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. మరి అంతా టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్స్ అంటూ హంగామా మొదలెడితే.. ప్రతిరోజు టీం మాత్రం రోడ్ షోస్ అంటూ కొత్త ప్రచారానికి తెర లేపింది. ఏది ఏమైనా సోషల్ మీడియా మొత్తం క్రిస్టమస్ సినిమాల ప్రమోషన్స్ తో హోరెత్తుతోంది. మరోవైపు సంక్రాంతి రేస్ లో సరిలేరు, అల వైకుంఠపురములో, దర్బార్, ఎంత మంచి వాడవురా సినిమాల ప్రమోషన్స్ తోనూ సోషల్ మీడియా షేక్ అవుతుంది.  

Different Promotion to Prathi Roju Pandage Movie:

Social Media Shakes with Christmas Movie Promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs