Advertisement
Google Ads BL

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ అందరూ చూడాలంట!


సూట్డెంట్ ఆఫ్ ది ఇయర్ ప్రతి పేరెంట్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా - జీవిత రాజశేఖర్. డిసెంబర్ 27న స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ విడుదల !!

Advertisement
CJ Advs

రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై తెలుగులో వస్తున్న మూడో చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. గతంలో ఈ  సంస్థ ఈ వర్షం సాక్షిగా, ఎల్ 7 వంటి మంచి సినిమాలు తీశారు. ఈ బ్యానర్ బోజ్పురిలో పదికి పైగా చిత్రాలు తీశారు. తెలుగుపై మక్కువతో  స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా తీశారు. ఈ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. జీవిత రాజశేఖర్ దంపతులు, మల్కాపురం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ మాట్లాడుతూ... స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా మెసేజ్ తో కూడిన చిత్రం. నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి ఫ్యాషన్ తో ఈ సినిమాను నిర్మించాడు. ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ బాగున్నాయి. నటీనటులందరు బాగా నటించారు. ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. యాజమాన్య అందించిన సంగీతం బాగుంది. రాజమౌళి గారి దగ్గర వర్క్ చేసిన కరుణ కుమార్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. కథ బలం ఉన్న సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతూ ఉంటాయి. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో కథతో పాటు సందేశం ఉంది కావున ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా అన్నారు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ...  చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మనం మన పిల్లల్ని ఏ స్కూల్ లో వదలాలి అని ఆలోచిస్తాం. అలా మనం మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని తాపత్రేయ పడతాం. సూట్డెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో స్టూడెంట్స్ గురించి ఒక మంచి మెసేజ్ ఉంది. ప్రతి పేరెంట్స్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా ఇది. డైరెక్టర్, నిర్మాతకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది. అలాగే ఈ మూవీలో నటించిన కొత్త ఆర్టిస్ట్స్ అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ... నా మిత్రుడు ఓబుల్ సుబ్బారెడ్డి సినిమాపైన ఆసక్తితో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాను నిర్మించాడు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఒక పాయింట్ ను తీసుకొని ఈ సినిమా తీసాడు దర్శకుడు కరుణ కుమార్. నేను మూవీ చూశాను నచ్చింది. అందుచేత ఈ చిత్రాన్ని నేనే స్వయంగా విడుదల చేయడానికి ముందుకు వచ్చాను. కచ్చితంగా ఈ సినిమా ప్రజాదరణ పొందుతుందని భావిస్తున్నాను అన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బి.ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ...  మంచి సందేశం ఉన్న కథతో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా తియ్యడం జరిగింది. నేను తెలుగులో తీస్తున్న మూడో సినిమా ఇది. డైరెక్టర్ కరుణ కుమార్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. హీరో శ్రీనాధ్ మాగంటి బాగా నటించాడు. హరిప్రసాద్ గారు మాకు మంచి కథను అందించారు. అన్న మల్కాపురం శివకుమార్ ఈ సినిమా చూసి ఫ్యాన్సీ రేటుకు సినిమా కొనడం మరింత ఎనర్జీ ఇచ్చింది. గతంలో నేను తెలుగులో నిర్మించిన ఈ వర్షం సాక్షిగా, ఎల్7 చిత్రాల తరహాలో ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చి పెడుతుందని భావిస్తున్నా. ఈ సినిమా వల్ల కొంత మంది స్టూడెంట్స్ అయినా మారితే నాకు సంతోషం. ఈ సినిమాతో నాకు డబ్బు వస్తుందా లేదా అనే విషయాలు పక్కన పెడితే మంచి సినిమా తీశానన్న తృప్తి ఉందన్నారు.

డైరెక్టర్‌ కరుణ కుమార్‌ మాట్లాడుతూ... నా నిర్మాత ఓబుల్‌ సుబ్బారెడ్డి సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. నా మిత్రుడు హరి ప్రసాద్‌ చక్కటి మెసేజ్‌ ఉన్న కథను అందించాడు. సినిమా అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని ఈ సినిమాలో చెప్పారు. ద్రోణ సినిమా తరువాత నేను చేసిన సినిమా ఇది. అంతకుముందు నేను రాజమౌళి గారి దగ్గర వర్క్ చేశాను. డిసెంబర్ 27న విడుదల కాబోతున్న  స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ పాయింట్‌ అందరికీ తప్పకుండా కనెక్ట్‌ అవుతుంది అని తెలిపారు.

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ బాగుంది. ఇప్పుడే ట్రైలర్, సాంగ్స్ చూశాను మేకింగ్ బాగుంది. యువతకు సందేశం ఇచ్చే సినిమా ఇది. నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి, డైరెక్టర్ కరుణ కుమార్ ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. అలాగే ఈ మూవీలో నటించిన హీరో హీరోయిన్స్ కు మంచి పేరు వచ్చి వారు బిజీ ఆర్టిస్ట్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

నటీనటులు: సంజయ్ ఇదామ, శ్రీనాధ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ

సాంకేతిక నిపుణులు:

డైరెక్టర్: జె.కరుణ కుమార్

నిర్మాత: బి.ఓబుల్ సుబ్బారెడ్డి

కథ - మాటలు: జక్కా హరిప్రసాద్

సంగీతం: యాజమాన్య

లిరిక్స్: రాంబాబు గోషల

పీఆర్ఓ: మధు వి.ఆర్

Student of the Year Movie Audio Released:

Celebrities Speech at Student of the Year Movie Audio Launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs