Advertisement
Google Ads BL

‘రూలర్’ ట్రైలర్: గర్జించిన సింహం


బాలయ్య బరిలోకి దిగితే మిగతావాళ్ళకి షేకే.. అది బాలయ్య మాస్ పవర్. బాలకృష్ణ అంటే మాస్ కాదు కాదు ఊసర మాస్. రూలర్ అంటూ గర్జించే సింహాన్ని నిద్ర లేపారు. కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ - వేదిక - సోనాల్ చౌహన్ కలిసి నటించిన రూలర్ ట్రైలర్ మాస్ ఫ్యాన్స్ ని, నందమూరి ఫ్యాన్స్ ని అల్లడిస్తుంది. డిసెంబర్ 20 న గర్జించడానికి రెడీ అయిన బాలయ్య రూలర్ ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన రూలర్ ట్రైలర్ కొద్ది గంటల్లోనే ట్రేండింగ్ లోకి వచ్చేసింది. రూలర్ ట్రైలర్ లో బాలకృష్ణ మాస్ లుక్స్ అండ్ స్టయిల్ చూసి ఫ్యాన్స్ సూపర్బ్ అంటున్నారు. ఫ్యాన్స్ అన్నారని కాదు ఒక్క పోలీస్ గెటప్ తప్పితే... బాలయ్య గెటప్ ఈ సినిమాకే హైలెట్ అనేలా ఉంది.

Advertisement
CJ Advs

బాలకృష్ణని హైలెట్ చేస్తూ కట్ చేసిన రూలర్ ట్రైలర్ లో మాస్ కి నచ్చే యాక్షన్ భారీగా ఉండడం, కావాల్సినంత కాదు ఏడిపించేంత ఎమోషన్ కూడా ఉంది. రైతుల నేపథ్యంలో, రైతులతోనే కథకు ముడిపెట్టాడు దర్శకుడు. అందులోనే రాజకీయాలతో పాటు యాక్షన్ డ్రామాను కూడా మిక్స్ చేసాడు. ఒకపక్క ఫ్యామిలీ డ్రామాని నడిపించిన దర్శకుడు మరోవైపు మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని బాలయ్యతో యాక్షన్ ఇరగదీపించాడు. బాలయ్య గన్ తిప్పే చివరి షాట్ అబ్బ అనేలా ఉంది. భూమిక ఎమోషన్ లుక్స్, జయసుధ పవర్ ఫుల్ లుక్స్, ప్రకాష్ రాజ్ పొలిటికల్ లుక్, సోనాల్ చౌహన్ గ్లామర్ అండ్ హాట్ లుక్, వేదిక ట్రెడిషనల్ లుక్ అన్ని రూలర్ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఇది దెబ్బతిన్న సింహంరా.. అంత తేలిగ్గా చావదు.. వెంటాడి వేటాడి చంపుద్ది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ అనేలా ఉంది. బాలయ్య చెప్పిన ప్రతి మాస్ పవర్ ఫుల్ డైలాగ్స్ మాత్రం మాస్ ప్రేక్షకులకు పిచ్చగా ఎక్కేస్తున్నాయి. ఈ క్రిస్టమస్ కి అందరూ లవ్ స్టోరీస్ తో వస్తుంటే బాలయ్య మాత్రం మాస్ మసాలా కథతో వస్తున్నాడు. 

Click Here For Trailer

Ruler Trailer: Action Packed:

Ruler Trailer Report
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs