Advertisement
Google Ads BL

సక్సెస్ మీట్‌లో ‘మేరా దోస్త్‌ ’


పవన్‌, శైలజ జంటగా వి.ఆర్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై  పి .వీరారెడ్డి నిర్మాతగా జి.మురళి డైరెక్షన్‌ లో రూపొందిన చిత్రం ‘మేరా దోస్త్‌’. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఫిలించాంబర్‌లో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత పి.వీరారెడ్డి మాట్లాడుతూ...‘‘మేము ఏ టార్గెట్‌తో అయితే సినిమాను నిర్మించామో ఆ టార్గెట్‌ రీచ్‌ అయ్యాం. ఈరోజు మా సినిమా ప్రదర్శింపబడుతోన్న కొన్ని థియేటర్స్‌ సందర్శించాం. పాటలకు, ఫైట్స్‌కు, ఫ్రెండ్‌షిప్‌ వాల్యూస్ కి ఆడియన్స్‌ కనెక్టవుతున్నారు. ఒక మంచి సినిమా తీసామన్న ఆనందంతో థియేటర్‌ నుంచి బయటకొచ్చాం. ఇంకా మా సినిమాను పెద్ద సక్సెస్‌ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.

Advertisement
CJ Advs

దర్శకుడు జి.మురళి మాట్లాడుతూ.. ‘‘ఉషా మయూరిలో ఈ రోజు సినిమా చూశాం. ఆడియన్స్‌ ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. విడుదలైన అన్ని ఏరియా నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మా సినిమాను ఇంత మంచి సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు.

హీరోయిన్‌ శైలజ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు విడుదలైన మా సినిమాను ఆడియన్స్‌తో కలిసి థియేటర్‌లో చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. సాంగ్స్‌, లవ్‌ సీన్స్‌, సెంటిమెంట్  సీన్స్‌ కి ఆడియన్స్‌ కనెక్టవుతున్నారు’’ అన్నారు.

బాక్సాఫీస్‌ అధినేత చందు రమేష్‌ మాట్లాడుతూ.. ‘‘మేరాదోస్త్‌’ సినిమా రెండు తెలుగు  రాష్ట్రాల్లో  గ్రాండ్‌గా రిలీజైంది. విడుదలైన అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. థియేటర్స్‌ కూడా పెంచడానికి నిర్మాత ప్లాన్‌ చేస్తున్నారు. ఇంత మంచి సినిమా చేసిన దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు’’ అన్నారు.

కాశీవిశ్వనాధ్‌, బెనర్జీ, అమిత్‌, వీరారెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్‌ : చిన్న, ఎడిటర్‌ : నందమూరి హరి,  కెమెరా: సుధీర్‌, నిర్మాత: పి. వీరారెడ్డి, డైరెక్టర్‌: జి.మురళి. 

Mera Dosth Movie Success Meet Details:

Mera Dosth Movie Celebrates Movie Success
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs