Advertisement
Google Ads BL

ఈ సినిమా ఇలా గమ్మత్తుగా పోతుందనుకోలేదు


కమెడియన్ గా స్టార్ సినిమాల్లో పనిచేస్తూ బిజీగా గడిపే శ్రీనివాస రెడ్డి ఇప్పుడు డైరెక్టర్ గా కూడా సినిమా తీసేసాడు. కామెడీ చేస్తున్నా డైరెక్షన్ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్న శ్రీనివాస రెడ్డికి ఆ కోరిక కూడా తీరింది. గీతాంజలి సినిమాలో మెయిన్ కేరెక్టర్ గా నటించిన శ్రీనివాస రెడ్డి ఆ సినిమాలో కథ పట్టుకుని డైరెక్టర్ అవ్వాలని తిరుగుతుంటాడు. అలాగే ఇప్పుడు ఓ కామెడీ కథతో భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అంటూ టైటిల్ పెట్టి మంచి రసగుల్లా లాంటి సినిమా అంటూ క్యాప్షన్ పెట్టాడు. మరి భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మాత్రం... మంచి రసగుల్లా లాంటి సినిమా కాదు. నిన్న శుక్రవారం విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ పడింది. అది శ్రీనివాసరెడ్డి కొంప ముంచింది.

Advertisement
CJ Advs

ఫ్లైయింగ్ కలర్స్ బ్యానర్ పై 2 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకి కామెడీ ఫ్రెండ్స్ ఎవరు పారితోషకాలు కూడా తీసుకోకుండా వర్క్ చేశారు. కానీ ఇప్పుడు ఆ సినిమాకి పడిన డిజాస్టర్ టాక్ సినిమాని ఏ తీరానికి చేరుస్తుందో అంటున్నారు. ఎందుకంటే నిన్న శుక్రవారం భాగ్యనగర వీధుల్లో థియేటర్స్ అన్ని బోసిపోయాయి. ఒక్క ప్రేక్షకుడు కూడా ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న శ్రీనివాస రెడ్డి.. ఈ డైరెక్షన్ పిచ్చి వలన మహేష్ సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలో కామెడీ పాత్ర కాదనుకుని సినిమాని డైరెక్ట్ చేసాడు. ఆ సినిమా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డికి కన్నీరు మిగిల్చేలా ఉంది. మరి సంపాదించిన 2 కోట్లు ఈ సినిమాపై పెట్టి... ఇప్పుడు సినిమాకి ప్లాప్ టాక్ పడడంతో.. ఆయనకి మిగిలేది కన్నీరే కదా అంటున్నారు. 

Bhagyanagara Veedhullo Gammattu Result at Box Office:

Bhagyanagara Veedhullo Gammattu Movie Talk Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs