Advertisement
Google Ads BL

‘ఫైటర్’ కోసం పూరి ఆ భామను ఫిక్సయ్యాడా!


పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండల కాంబో మూవీ ఫైటర్ రేపో మాపో పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ ని లాక్ చేసిన పూరి, విజయ్ దేవరకొండ కోసం ఎదురు చూడడమే కాదు.. విజయ్ దేవరకొండ కోసం హీరోయిన్ వేటలో ఉన్నాడు. విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ షూట్ లో బిజీగా వున్నాడు. విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ లేలేత అందాల  జాన్వీ కపూర్ ని తీసుకురావాలనుకున్నాడు. అయితే జాన్వీ కపూర్ తండ్రి బోనితో పూరి టచ్ లో ఉన్నప్పటికీ... జాన్వీ, విజయ్ సరసన నటించే అవకాశం లేనట్లుగా తెలుస్తుంది. అందుకే పూరి జగన్నాధ్ మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నాడట.

Advertisement
CJ Advs

అది కూడా బాలీవుడ్ లో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న కైరా అద్వానీ అయితే విజయ్ దేవరకొండకి సూట్ అవుతుందని, ఇప్పటికే విజయ్ - కైరాలు కలిసి ఓ యాడ్ లో నటించడంతో వాళ్ళ పెయిర్ బావుంటుందని పూరి అనుకుంటున్నాడట. అయితే కైరా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో నాలుగైదు సినిమాల్లో నటిస్తూ డేట్స్ ఖాళీ లేకుండా కూర్చుంది. తెలుగులో మహేష్, రామ్ చరణ్ తర్వాత మరో సినిమాకోసం సౌత్ కి రాని కైరాకి బాలీవుడ్ లో మాత్రం బంపర్ ఆఫర్స్ తగలడంతో ఆమె సౌత్ వంక చూడడం లేదు. కానీ పూరి మాత్రం ఎలాగైనా కైరాని విజయ్ సరసన చేర్చాలని చూస్తున్నాడు. అయితే కైరాకి కూడా విజయ్ పక్కన అవకాశం వస్తే అస్సలు వదలదు. కానీ డేట్స్ అనుకూలించాలిగా మరి. 

Puri Jagannadh searching Heroine for Fighter:

Puri Jagan wants Kiara Advani for Vijay Deverakonda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs