టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. సినిమాల్లో ఆయన క్రేజ్ వేరు.. మూవీస్ పరంగా ఈయన గ్రాండ్ సక్సెస్ అయ్యి స్టారో హీరోగా నిలిచాడు. అయితే రాజకీయాల్లో మాత్రం ఆశించినంత రీతిలో రాణించలేకపోయాడు.. ఆ విషయాలన్నీ ప్రస్తుతం అనవసరం.. అప్రస్తుతం. ఇటు సినిమాలు వదిలేసి చాలా రోజులైనా పవన్‌ను మాత్రం ఓ హీరోయిన్ వెంటాడుతూనే ఉంది. ఇంతకీ విరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ.. ఆ హీరోయిన్ మాత్రం ‘పవన్.. నిన్ను వదల’ అంటూ అప్పుడప్పుడు అరుంధతిగా మారిపోతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనేది అర్థమయ్యే ఉంటుంది కదా.. ఆమేనండోయ్.. పూనమ్ కౌర్. ఈ పేరు సినీ ప్రియులకు.. మరీ ముఖ్యంగా మెగాభిమానులు, జనసేన కార్యకర్తలకు ప్రత్యేకించి మరీ పరిచయం చేయనక్కర్లేదు.
అసలేం జరిగిందో..!
వీరిద్దరి మధ్య ఎప్పుడేం జరిగిందో అసలు విషయం బయటికి రాలేదు కానీ.. పూనమ్ మాత్రం తనకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు పోస్ట్‌ల రూపంలో చెప్పుకుంటోంది. ఇప్పటికే పలుమార్లు పవన్‌పై పోస్ట్‌లు పెట్టిన పూనమ్.. జనసేనాని ఏం మాట్లాడిన తనకు తోచినప్పుడల్లా స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇస్తూనే ఉంటోంది. అయితే అంతే రీతిలో పవన్ వీరాభిమానులు, మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు స్పందిస్తూ వస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ అభిమానుల కామెంట్స్‌కు తట్టుకోలేక తన పోస్ట్‌లు డెలీట్ చేసిన సందర్భాలున్నాయంటే అర్థం చేసుకోవచ్చు.
మొదట్నుంచి సీరియస్‌గానే!
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై సామాన్యుడి మొదలుకుని సెలబ్రిటీ వరకూ స్పందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కూడా స్పందిస్తూ.. నిందితులను గట్టిగా చెమ్డాలు ఊడేలా రెండు దెబ్బలు కొట్టాలని పిలుపునిచ్చారు. అయితే ఆ ఘటనకు పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత మాత్రం.. ఆ కరాళ రాత్రి వేళ నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని చూసిందో తలచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో శరీరం ఉడికిపోతోందని ఓ ప్రకటన చేశాడు. అయితే మొదట్నుంచి ఈ దిశ ఘటనపై పూనమ్ చాలా సీరియస్‌గానే స్పందిస్తోంది. అంతేకాదు ఒకనొక సందర్భంలో సహనం కోల్పోయి ఆ నలుగురు కామాంధులను చంపి జైలుకు వెళ్తానని చెప్పుకొచ్చింది.
రెండు చాలు.. నువ్వెక్కడున్నా.. నిన్నొదలా!
అయితే ఇవన్నీ పవన్ రియాక్ట్ అవ్వక ముందు పూనమ్ చేసిన వ్యాఖ్యలు. ఆ నలుగురు ఎన్‌కౌంటర్ అయ్యాక మరోసారి పూనమ్ ట్విట్టర్ వేదికగా స్పందించింది ‘దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ పోలీసులకు, ప్రభుత్వానికి థ్యాంక్స్. ఇలాగే నాలా పలువురు మహిళల్ని మోసం చేసిన కొంతమంది సిని అలియాస్ రాజకీయ నాయకుల్ని కూడా శిక్షిస్తారని భావిస్తున్నాను. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు..’ అంటూ పూనమ్ ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. అయితే పవన్‌పై పరోక్షంగా ఇలా కామెంట్స్ చేసిందన్న విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ట్వీట్ చేసిన కొద్దిసేపటికే మళ్లీ డెలీట్ చేసేసింది. ఇందుకు కారణం.. పవన్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు.. పెద్ద ఎత్తున కామెంట్స్ రావడమేనని తెలుస్తోంది.
మొత్తానికి చూస్తే.. అదేదో సామెత ఉంది కదా.. ‘రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేద’న్నట్లుగా.. పవన్ సినిమాలకు టాటా చెప్పేసి రాజకీయాల్లో తన పని తాను చేసుకుంటూ పోతున్నా ఈ హీరోయిన్ టార్చర్ మాత్రం తప్పట్లేదు..! ‘నువ్వెక్కడున్నా.. నిన్నొదలా’ అంటూ పూనమ్ కౌర్ నీడలా వెంటాడుతోంది. మరి వీరిద్దరి మధ్య వివాదానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో ఏంటో.. వెయిట్ అండ్ సీ!