Advertisement
Google Ads BL

ప్రభాస్ సినిమాలో అతిథిగా టాప్ హీరోయిన్!


‘సాహో’ సినిమా తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ మరో కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు పేరేంటి అనేది ఇంకా పక్కాగా ఫిక్స్ కాలేదు కానీ.. ప్రస్తుతానికి ‘జాన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ షురూ చేసేస్తున్నారు. అయితే సినిమా ఎలా ఉంటుంది..? ఏ జోనర్‌లో తెరకెక్కుతోంది..? అని అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. చిన్నపాటి లీక్స్ వస్తున్నప్పటికీ ఇందులో నిజమెంత ఉందో అనే విషయంపై మాత్రం చిత్రబృందం ఇంతవరకూ స్పందించలేదు. దీంతో రోజురోజుకు పుకార్లు గట్టిగానే షికార్లు చేస్తున్నప్పటికీ క్లారిటీ మాత్రం రాలేదు.

Advertisement
CJ Advs

ఇప్పటికే పూజా మ్యూజిక్ టీచర్ పాత్రలో నటిస్తోందని ఆమె లుక్‌కు సంబంధించి డైరెక్టర్ కసరత్తులు చేస్తున్నాడని డైరెక్టర్ కసరత్తులు చేస్తున్నాడని సమాచారం. మరోవైపు ప్రభాస్ డబుల్ రోల్‌లో చేస్తున్నాడనీ వార్తలు గుప్పుమంటున్నాయ్. ఈ రెండు విషయాలు పక్కనెడితే తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. అదేమిటంటే.. ఈ సినిమాలో పూజతో పాటు మరో టాప్ హీరోయిన్‌ కాజల్ కూడా కనిపిస్తుందట. అయితే కాజల్‌ది మాత్రం అతిథి పాత్ర అని తెలుస్తోంది. డార్లింగ్ మూవీలో మీరు నటించాలని కాజల్‌ను అడగ్గా మారుమాట చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇందుకు కారుణం ప్రభాస్-కాజల్ మధ్య ఉన్న సాన్నిహిత్యమేనట. ప్రభాస్ డబుల్ రోల్‌లో ఒకరికి పూజా.. మరొకరికి కాజల్ అని సమాచారం.

అయితే ప్రభాస్ సరసన ఫస్ట్ టైమ్ పూజా నటిస్తోంది. ఆయన గురించే ఇప్పుడిప్పుడే తెలుసుకున్న ఈ భామ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డార్లింగ్‌ను ఆకాశానికెత్తేసింది. ఇక కాజల్ విషయానికొస్తే ఈ కాంబో కొత్తేమీ కాదు.. ఇప్పటికే ప్రభాస్ సరసన ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’.. ఈ రెండు సినిమాలు బాగానే ఆడాయ్. అంటే ముచ్చటగా మూడోసారి ప్రభాస్ సరసన ఈ బ్యూటీ నటిస్తోందన్న మాట. మరి తాజా పుకారులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

Top Heroine Guest Role In Prabhas Movie!:

Top Heroine Guest Role In Prabhas Movie!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs