Advertisement
Google Ads BL

‘చమ్మక్ చంద్ర’ కూడా వెనక్కి వచ్చేశాడు


నాగబాబు జబర్దస్త్ ని వీడిన తర్వాత నాగబాబుతో పాటుగా చంద్ర, సుధీర్, ఆది లాంటి వాళ్ళు వెళ్ళిపోతారనుకుంటే.. కేవలం చమ్మక్ చంద్ర మాత్రమే నాగబాబు అడుగులో అడుగు వేసాడు. జబర్దస్త్ కి దూరమయ్యాడు. కారణాలు చెప్పలేదు కానీ.. తాను జబర్దస్త్ నుండి బయటికి వచ్చినట్టుగా కన్ఫర్మ్ చెయ్యడమే కాదు.... త్వరలోనే మరికొంతమంది జబర్దస్త్ ని వీడతారని చెప్పాడు. ఇక నాగబాబు జబర్దస్త్ కమెడియన్స్ ని లాగేసి జీ ఛానల్ లో లోకల్ గ్యాంగ్స్ కి తీసుకెళదామనుకుంటే... హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, కిరాక్ ఆర్పీ లాంటోళ్ళు నాగబాబుకి హ్యాండ్ ఇచ్చేసారు. అయితే చంద్ర మాత్రం నాగబాబుతో వెళ్లిపోయాడు. ఇక చంద్ర స్కిట్స్ జబర్దస్త్ లో కనబడవని కామెడీ లవర్స్ ఫీల్ అయ్యారు. మరి ఎక్స్ట్రా జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర చాలా స్కిట్స్ కొట్టాడు. చమ్మక్ చంద్ర స్కిట్స్ అంటే చాలామంది చెవులు కోసుకునేవారు ఉన్నారు.

Advertisement
CJ Advs

జబర్దస్త్ నుండి చమ్మక్ చంద్ర వెళ్లిపోవడంతో.. గత శుక్రవారం చంద్ర స్కిట్ రాలేదు. అయితే తాజాగా చమ్మక్ చంద్ర ఈజ్ బ్యాక్. జబర్దస్త్ లోకి ఒక వారం గ్యాప్ తో మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు చంద్ర. తన టీంతో చమ్మక్ చంద్ర మళ్ళీ జబర్దస్త్ లోకి రావడం కామెడీ లవర్స్ కి సంతోష పెట్టే విషయమే కానీ.. చమ్మక్ చంద్ర నాగబాబుని కాదని మళ్ళీ జబర్దస్త్ కి ఎందుకొచ్చాడో చాలామందికి అర్ధం కావడం లేదు. అయితే తాజాగా మల్లెమాల టీం చంద్రని మ్యానిప్లెట్ చేసి.. అధిక పారితోషకం ఆఫర్ చెయ్యడం వలనే జబర్దస్త్ కి మళ్ళీ వచ్చాడని టాక్ అయితే ఫిలింనగర్ లో వినబడుతుంది. లేదంటే నాగబాబు భజన చేసిన చంద్ర మళ్ళీ రావడం ఏమిటో అని పెదవి విరుస్తున్నారు. మరికొంతమంది చంద్ర వచ్చినట్టే నాగబాబు మళ్ళీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు.

Chammak Chandra is back to Jabardasth:

Jabardasth: Star Comedian Turned
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs