ఈ రోజు ఉదయం నిద్ర లేచిన అందరికి ఓ షాకింగ్ న్యూస్... అండ్ హ్యాపీ న్యూస్.. దిశా నిందితుల ఎన్‌కౌంటర్. తెల్లవారుజామున దిశా నిందితుల నలుగురిని తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో లేపేసారనే న్యూస్ ఉంది చూసారు.. కాఫీ తాగకుండానే కిక్ ఇచ్చిన న్యూస్ ఏది. దిశాని అత్యాచారం చేసి హత్య చేసిన వారిని ఉరి తీయాలని, ఎన్‌కౌంటర్ చేయాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటిన సమయంలో తెలంగాణ పోలీసులు సైలెంట్‌గా తమ పనిని ఎన్‌కౌంటర్ రూపంలో ముగించెయ్యడం అనేది దిశా తల్లి తండ్రులకే కాదు... ఆడపిల్లలున్న తల్లితండ్రులందరికీ గర్వకారణం. గత రెండు రోజులుగా దిశా నిందితులను విచారిస్తున్న పోలీసులు.. ఈ రోజు తెల్లవారు జామున షాద్‌నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద ఎన్‌కౌంటర్ చేశారు
పోలీసుల సమాచారం ప్రకారం.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు దిశా నిందితులు ప్రయత్నించారు. అంతేగాక పోలీసుల మీద ఆ నలుగురు నిందితులు రాళ్ళు రువ్వేందుకు ప్రయత్నించడం, పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. దాంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. దిశాను చంపేసి నిప్పంటించిన చోటే నలుగురు నిందితులు చనిపోయారు. తెల్లవారుజామున 3.30 నుండి 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నలుగురి మృతదేహాలను షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే ఈ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రజలు, సినీ ప్రముఖులు.. సరైన న్యాయం చేశారని పోలీసులకు సెల్యూట్ చేస్తున్నారు. వారిలో
ఎన్టీఆర్: న్యాయం జరిగింది.. ప్రియాంక రెడ్డి ఆత్మకు శాంతి కలగాలి.
నాని: ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి... వాడు పోలీసోడు అయ్యిండాలి
హరీష్ శంకర్: దండాలు సామీ.. మీరు పది కాలాలు పాటు చల్లగా ఉండాల అంటూ తెలంగాణ పోలీస్ లకు హరీష్ శంకర్ వందనం చేసాడు.
నాగార్జున: ఎన్‌కౌంటర్ న్యూస్‌తో నిద్ర లేచాను, దిశాకి న్యాయం జరిగింది.
మంచు మనోజ్: ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది.. ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది. ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు వుందా..?? ఈ రోజునే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..!
అనసూయ: చాలా హ్యాపీగా ఉంది.