నిన్నమొన్నటివరకు ప్లాప్స్ తో సతమతమైన రాశి ఖన్నా ఇప్పుడు తెలుగు, తమిళ ఆఫర్స్ తో బాగానే బిజీ అయ్యింది. బొద్దు పాప కాస్త ముద్దుగా తయారైంది కూడా. అందుకే అవకాశాలు రాశి ఖన్నాని వెతుక్కుంటూ వస్తున్నాయి. అలాగే మాంచి పిఆర్ టీంని మెయింటింగ్ చెయ్యడంతో.. రాశి ఖన్నాకి అవకాశాలు కూడా బాగున్నాయి. తాజాగా టాలీవుడ్ లో రాశి ఖన్నా హడావిడి మాములుగా మొదలవ్వలేదు. ఒకే రోజు రెండు సినిమా ప్రమోషన్స్ తో రాశి ఖన్నా పిచ్చెక్కిస్తుంది. ఈ నెలలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాశి ఖన్నా నిన్న జరిగిన రెండు సినిమాల ప్రెస్ మీట్స్ లో హోయలు పోయింది.
వెంకీమామ సినిమాలో నాగ చైతన్యకి జోడిగా నటించిన రాశిఖన్నా... ఆ సినిమాతో డిసెంబర్ 13 కి రాబోతుంది. ఈ సినిమాలో చైతుకి లవర్ గా రాశి ఖన్నా లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మరో పక్క ప్రతి రోజు పండగే సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో డిసెంబర్ 20 కి రావడానికి రెడీ అయ్యింది. వెంకీమామ ప్రమోషన్స్ కాస్త లేట్ గా స్టార్ట్ కావడంతో... రాశి ఖన్నా కూడా హరి బరిగా రెండు సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. వెంకీమామ ప్రెస్ మీట్ తో నిన్న ఉదయం హడావిడి చేసిన రాశి ఖన్నా సాయంత్రానికి ప్రతిరోజూ పండగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో గ్లామర్ గర్ల్ లా మెరిసింది. ఒకే రోజు రెండు సినిమాల ప్రమోషన్స్ తో రాశి ఖన్నా హడావిడి చూసినోళ్లకి.. అబ్బా రాశి టైం స్టార్ట్ అయిందిగా అంటున్నారు. మరి ఈ రెండు సినిమాలే కాకుండా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ లోను రాశి హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ఫిబ్రవరి 14 న విడుదల కాబోతుంది.