Advertisement
Google Ads BL

‘హేజా’ పెద్ద హిట్టవ్వాలి: తనికెళ్ల భరణి


‘హేజా’ మున్నా కాశికి నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపునిస్తుంది - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త‌నికెళ్ళ భ‌రణి. 

Advertisement
CJ Advs

సంగీత ద‌ర్శ‌కుడు మున్నా కాశి  హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హేజా’.  (ఎ మ్యూజికల్ హారర్).  వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై  కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌నికెళ్ళ భ‌రణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ముమైత్ ఖాన్, నూతన్ నాయుడు( బిగ్ బాస్ ఫేమ్),ల‌క్ష్మ‌న్(ఆర్.ఎక్స్ 100ఫేమ్). లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీని అందించారు. మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం దసపల్లా హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో...

నటుడు త‌నికెళ్ళ భ‌రణి మాట్లాడుతూ - ‘‘ఎట్టి పరిస్థితులలోనూ హిట్ కొట్టాలనే లక్ష్యం, తపనతో ఈ సినిమా తీశారు దర్శకుడు మున్నా కాశి. కొత్త పాయంట్ తో వస్తోన్నచిన్న సినిమా, వైవిధ్యమైన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్నఈ తరుణంలో వస్తోన్న ‘హేజా’ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

స‌హ‌ నిర్మాత వి.ఎన్.వోలేటి మాట్లాడుతూ - ‘‘మున్నాకాశితో 2008 నుండి ట్రావెల్ చేస్తున్నాను. నాకు సినిమా రంగం మీద అనుభవం లేకున్నా మున్నా నరేట్ చేసిన విధానం, కథ నచ్చి ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమా ఇంత తొందరగా ఓకే అవుతుంది అని మేము అనుకోలేదు. దుబాయ్ లో మంచి ఉద్యోగం ఉన్నా వదులుకొని తనని తాను నిరూపించుకోవాలి అని వచ్చి సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు మున్నా కాశి. ఇప్పుడు డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే కసితో చేసిన సినిమా ఇది. టీమ్ అందరూ అంకితభావంతో పనిచేశారు. తప్పకుండా పెద్ద సక్సెస్ సాధిస్తాం’’ అన్నారు.

రచయిత మాట్లాడుతూ... ‘‘మున్నా కాశి వన్ మ్యాన్ షో ఈ సినిమా. ఈ సినిమా స్పెషల్ షో వేసినప్పుడు నేను చూశాను. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ బాగా నటించారు. హీరోయిన్ క్యారెక్టర్ అద్భుతంగా ఉంది. మున్నా మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి హారర్ సినిమా అయినా మంచి మ్యూజిక్ ఇచ్చారు. 

సురేష్ కొండేటి మాట్లాడుతూ - ‘‘హారర్ సినిమాలో ఎక్కువగా పాటలు ఉండవు కానీ ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. డెఫినెట్ గా ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హీరోయిన్ లిజీ గోపాల్ మాట్లాడుతూ - ‘‘ఈ మూవీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.

దర్శక నిర్మాత మున్నాకాశి మాట్లాడుతూ  - ‘‘హేజా అంటే బ్యూటిఫుల్ అని అర్ధం. తెలుగులో మ్యూజికల్ హారర్  జోనర్ లో ఇంతవరకూ సినిమా రాలేదు. ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా. సినిమాలో ఒక డెవిల్ కి, మ్యుజిషియన్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమా. టెక్నికల్ గా చాలా బాగా ఉంటుంది. సినిమా చూడగానే ఒక బాక్సాఫీస్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. డిసెంబర్ 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. మా ప్రొడ్యూసర్ వి ఎన్ వోలేటి గారి సపోర్ట్ వల్లనే ఈ సినిమా ఇంత తొందరగా రిలీజ్ అవుతుంది. లిజీ గోపాల్ హీరోయిన్ గా కన్నా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎక్కువ కష్టపడింది. తన క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం ఉంది. నా స్నేహితుడు నాని చమిడిశెట్టి ఈ సినిమాకు అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. వంశీ కూడా మంచి సపోర్ట్ చేశారు. అలాగే నూతన్ నాయుడు, లక్ష్మణ్ మంచి క్యారెక్టర్స్ చేశారు. ముమైత్ ఖాన్ ను డెవిల్ గా చూపించడం జరిగింది. ఆమె కూడా మంచి కమిట్మెంట్ తో వర్క్ చేసింది. ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ చాలా బాగా సపోర్ట్ చేశారు. త‌నికెళ్ళభ‌రణి మొదటి నుండి నన్నుసపోర్ట్ చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ ఈ సినిమాలో కీలకంగా ఉంటుంది. ఈ ఇండస్ట్రీకి చిరంజీవి గారు అనేక విధాలుగా సహాయం చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఇచ్చే మెస్సేజ్ కి ఈక్వల్ గా ఉండే మెస్సేజ్ ఈ సినిమా ద్వారా ఇవ్వడం జరిగింది. మా సినిమాకు మొదటి నుండి సపోర్ట్ చేస్తున్న మీడియాకి ధన్యవాదాలు’’ అన్నారు.

నటీనటులు : మున్నా కాశి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, ముమైత్ ఖాన్, నూతన్ నాయుడు, ల‌క్ష్మ‌న్(ఆర్.ఎక్స్ 100), లిజి గోపాల్, భూష‌న్‌, ప్రీతం నిగమ్ తదితరులు...

సాంకేతిక నిపుణులు :

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం - మున్నా కాశి

ప్రొడ్యూసర్: -  కెవిఎస్ఎన్ మూర్తి

స‌హ‌నిర్మాత:-  వి.య‌న్ వోలెటి

బ్యానర్ : వి.ఎన్.వి క్రియేషన్స్

సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి 

ఎడిటర్ : గ్యారీ బి హెచ్ 

పి.ఆర్.ఓ : సాయి సతీష్

Heza Movie Pre Release Event Highlights:

Celebrities Speech at Heza Movie Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs