Advertisement
Google Ads BL

పోస్టర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల


శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి యం ఆర్. (TMR) దర్శకుడిగా, విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షిత సోనావనే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా  ‘పోస్టర్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ సినిమా హీరోతో నాకు ఎప్పటి నుండో చాలా మంచి పరిచయం వుంది. తను హీరోగా చేస్తుండటం నాకు చాలా సంతోషంగానూ ఉంది, ఈ సినిమా టైటిల్ పోస్టర్ అనగానే చాలా కొత్తగా అనిపించింది. ఈ పోస్టర్ టీం అందరికి నా అభినందనలు తెలుపుతూ ఈ సినిమా విడుదల అయి మంచి విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. 

Advertisement
CJ Advs

హీరో విజయ్ ధరన్ మాట్లాడుతూ... మా సినిమా ఫస్ట్ లుక్ అనిల్ రావిపూడి గారి చేతుల మీదుగా విడుదల అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ఇష్టమైన దర్శకుడు అనిల్ రావిపూడి గారు. నన్ను ఈ సినిమాకు హీరోగా తీసుకున్న మా దర్శకుడికి ధన్యవాదాలు. మా ఈ పోస్టర్ సినిమా కథ కథనం చాలా నేచురల్ గా ఉంటుంది. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది అని అన్నారు. 

దర్శకుడు టి ఎం ఆర్ మాట్లాడుతూ... మనం సినిమా గురించి మాట్లాడుకుంటే మొదట కథ, దర్శకుడు గురించి మాట్లాడుకుంటాం. సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత పోస్టర్ గురించి మాట్లాడుకుంటాం. మేము అలాంటి ఒక మంచి టైటిల్ తో మంచి కథని మీ ముందుకి తెస్తున్నాం. మా ఈ పోస్టర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. ఈ సినిమా టీజర్ అతి త్వరలో మీ ముందుకి వస్తుంది, మీరంతా తప్పక చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు. 

ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా శివాజీ రాజా, మధుమణి, కాశి విశ్వనాధ్, రామరాజు, అరుణ్ బాబు, స్వప్నిక, జగదీశ్వరి, కీర్తికా, గణేష్ శంకర్, మల్లికార్జున్, అజయ్ వంటి నటీనటులు నటించారు. ఈ సినిమాకు మాటలు నివాస్, సంగీతం శాండీ అద్దంకి, కెమెరా రాహుల్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్. టి శేఖర్ రెడ్డి, ఏ గంగా రెడ్డి, ఐ జి రెడ్డి మరియు మహిపాల్ రెడ్డిలు కలసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ అతి త్వరలో మన ముందుకి రానుంది.

Anil Ravipudi Launches Poster Movie First Look:

Poster Movie First Look Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs