ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా మామాంగం ట్రైలర్ లాంచ్
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక విభిన్నమైన కథతో మన ముందుకు రానున్నారు. కేరళ రాష్ట్ర చరిత్రలోని ఒక అద్భుతమైన కథతో ఆయన నటించిన ‘మామాంగం’ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందించారు. జమోరిన్ పాలనలో చావెరుక్కళ్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ హిస్టారికల్ మూవీలో ఎన్నడూ చూడనటువంటి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు మమ్ముట్టి. అతి ప్రాచీనమైన కలరి విద్యలోని విశిష్టతను ఇంతకు ముందు ఎవరూ చూపించనంతగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో కావ్య ఫిల్మ్ కంపెనీ పతాకంపై వేణు కున్నపిళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఆయన లేడీ గెటప్ లో కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్ సినిమాలో చాలా కీలకం. ఇది ఏ సందర్భంలో వస్తుంది అనేది మాత్రం సర్ ప్రైజ్. ఈ లేడీ గెటప్ లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రసాద్‌ల్యాబ్స్‌లో ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ విడుదల చేయగా, సాంగ్‌ను యాత్ర మూవీ డైరెక్టర్ మహి.వి. రాఘవ్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో
ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ మాట్లాడుతూ... చరిత్రలో కనిపించని హీరోలు ఎందరో ఉన్నారు. సైరా కూడా అలాంటి పోరాట యోధుడి జీవిత గాథే. ఇప్పుడు వచ్చే మామాంగం కూడా అలాంటి ఒక పోరాట యోధుడి చరిత్రే. ఆయన పోరు కూడా ఒక స్వాంతంత్ర్యపోరాటం లాంటిది. నిర్మాతలు చాలా ఎంతో వ్యవప్రయాసలకోర్చి ఇంత చక్కటి చారిత్రాత్మక చిత్రం చేయడం చాలా గొప్పపని. ఈ చిత్రం కోసం దాదాపుగా 50కోట్లు ఖర్చు చేశారు. నన్ను ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయమని కోరగానే చాలా ఆనందపడ్డాను. మమ్ముట్టి గురించి మీకొక విషయం చెప్పాలి. స్వాతి కిరణం చిత్రంలో మలయాళ నటుడు తీసుకున్నప్పుడు అతను మన ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అవుతాడు అనుకున్నాను ఇలా తీసుకున్నారేంటి అని ఆశ్చర్యపోయాను. కానీ సినిమా విడుదలయ్యాక థియేటర్‌లో కనీసం లేచి నిలబడలేకపోయాం అంత గొప్పగా నటించారు. అంత గొప్ప నటుడాయన. ఓ పదేళ్ళ తర్వాత నేను ఆయనకు ఒక సందర్భంలో కాల్ చేశాను. పవన్ కళ్యాణ్ చిత్రం ఓ విలన్ పాత్ర ఉంది చేయమన్నాను దానికి ఆయన ఇదే మాట చిరంజీవిని అడుగుతావా అన్నారు. నేను అడగనన్నాను మరి నన్నెందుకు అడుగుతున్నావ్ అన్నారు. దర్శకుడు చాలా చక్కగా తీశారు. ఇమ్‌షా, ప్రాచీతెహలన్ చాలా బాగా నటించారు. వండర్ బాయ్ అతీష్ చాలా చక్కగా ఈ చిత్రం కోసం కరాటెలోని కలరీ అనే దాన్ని ప్రత్యేకంగా నేర్చుకుని చాలా చక్కగా చేశాడు. ఇంకా ఈ చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.
దర్శకుడు మహి.వి. రాఘవ్ మాట్లాడుతూ... మమ్ముట్టిగారు దాదాపు 400పైగా చిత్రాల్లో నటించారు. ఆయన నటించే చిత్రాల్లో ఆయన కనిపించడు కేవలం ఆయన పోషించిన పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. ఆయన నటించిన చిత్రాల్లో దాదాపుగా 80,90 మంది కొత్త దర్శకులకు అవకాశం కల్పించారు. నాతో సహా కలిపి అందుకు వారందరి తరపున ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. దర్శకుడు పద్మాకర్‌గారు ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ మాట్లాడుతూ... నాలుగు భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుంది. కేరళ హిస్టరీ పైన ఈ చిత్రం ఉంటుంది. ఇది మొత్తం భారతదేశానికి చరిత్ర అన్నట్లే. మా చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు వాసుగారికి, గీత ఆర్ట్స్‌కి నా ధన్యవాదాలు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆయనకు ఎక్కువ సమయం ఇవ్వకపోయినా చాలా తక్కువ సమయంలో చాలా చక్కటి సంగీతాన్ని సమకూర్చారు. ప్రస్తుతం ఆయన రాజమౌళిగారి చిత్రంతో బిజీగా ఉన్నారు.
వండర్ బాయ్ అచ్చుతన్ మాట్లాడుతూ... నేను ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌లో కలరి అనేదాన్ని నేర్చుకున్నాను. ఈ చిత్ర షూటింగ్ కోసం దాదాపుగా నేను రెండు సంవత్సరాలు స్కూల్‌కి కూడా వెళ్ళలేదు. కేవలం ఎగ్జామ్స్ టైంలో మాత్రమే వెళ్లి ఎగ్జామ్స్ రాసి వచ్చేవాడిని. ఇది నా మొదటి చిత్రం. నా మొదటి చిత్రమే మమ్ముట్టి గారితో చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఎంతో సపోర్ట్‌ని అందించిన మమ్ముట్టి గారికి ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు నన్ను ఒక తమ్ముడిలా చాలా బాగా చూసుకున్నారు. అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.
మమ్ముట్టి మాట్లాడుతూ... ఈ చిత్రం నాకు ఒక టాస్క్ లాంటిది. మాటల్లో చెప్పలేని అనుభవం ఇదొక మ్యాజిక్‌లా జరిగిపోయింది. అందరం చాలా ఫన్నీగా షూట్ చేశాం. అందరం చాలా సరదాగా ఎంజాయ్ చేశాం. ఇదొక మంచి అనుభవం. మామాంగం కేరళ మహోత్సవం మాత్రమే కాదు. మన దేశం మొత్తానికి మహోత్సవం లాంటిది. 16, 18శతాబ్ధాల్లో ఇది ఒక ఉత్సవంలా జరిపేవారు. ఎన్నో భావోద్యేవగాలతో నిండినటువంటి కథ ఇది. ఇది చరిత్రను ఎంతో వాస్తవికంగా కళ్ళముందు కట్టినట్టు తీసుకొచ్చారు. సీజీ చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువగా సెట్ ల పైనే దీన్ని తీశారు. ఇది ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన కథ. ఈ చిత్రంలోని వేసిన సెట్‌లు ఏవీ మీకు ఎక్కడా కూడా ఆర్టిఫిషయల్ అనిపించవు. వాస్తవికానికి దగ్గరగా ఉంటాయి అన్నారు.
మమ్ముట్టి, ప్రాచి తెహెలన్, ఉన్ని ముకుందన్, మోహన్ శర్మ, అను సితార, ప్రాచీ దేశాయ్, మాళవికా మీనన్, అభిరాం అయ్యర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్: ఎం. పద్మకుమార్, ప్రొడ్యూసర్: వేణు కున్నపిళ్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వివేక్ రామదేవన్, ఆయుజో ఆంటోనీ, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : శంకర్ రామకృష్ణన్, డైలాగ్స్ : కిరణ్, డి.ఓ.పి: మనోజ్ పిళ్ళై, యాక్షన్: శామ్ కౌశల్, వి.ఎఫ్.ఎక్స్: ఆర్.సి. కమలకన్నన్, ప్రొడక్షన్ డిజైనర్: మోహన్ దాస్, ఎడిటర్: రాజా మొహమ్మద్, మ్యూజిక్: ఎం. జయచంద్రన్, బి.జి.ఎం: సంచిత్ బల్హారా & అంకిత్ బల్హారా, పిఆర్ఓ : ఏలూరు శ్రీను.