Advertisement
Google Ads BL

ఆ 2 సినిమాలు కలిపితే ‘అల వైకుంఠపురములో’!?


టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్‌ను ఏలుతున్న పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన లుక్స్, సాంగ్స్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. లుక్స్ అదుర్స్ అనిపించగా.. సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేసేస్తున్నాయి. ‘సామజవరగమన’.. సౌతిండియాంలో రికార్డ్ సృష్టించింది. అయితే బన్నీ పాత్ర ఎలా ఉండబోతోంది..? పూజా పాత్రేంటి..? సీనియర్ నటి టబు పాత్రేంటి..? అనేదానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా బన్నీ పాత్రకు సంబంధించి ఫిల్మ్‌నగర్ ఓ పుకారు చేస్తోంది. ఎన్టీఆర్-సావిత్రి జంటగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’, దిలీప్ - మమతా మోహన్ దాస్ జంటగా  వచ్చిన ‘మైబాస్’ అనే రెండు చిత్రాల్లోని కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకున్న త్రివిక్రమ్.. తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేసేసి తెరకెక్కించేస్తున్నాడని టాక్ నడుస్తోంది.  వాస్తవానికి పాత, పొరుగింటి సినిమా (ఇతర భాషల్లోని)లకు సంబంధించి ఓ పాయింట్‌తో సినిమా తీసేయడం మాటలమాంత్రికుడికి కొత్తేం కాదు. అయితే ‘అల వైకుంఠపురములో..’ మూవీ కూడా ఆ కోవకు చెందినదేనట.

కాగా.. ‘ఇంటిగుట్టు’లో ఓ కేసును ఛేదించడం కోసం ఎన్టీఆర్.. సావిత్రి ఇంట్లో కారు డ్రైవర్‌గా చేరడం.. ఆయనకు బాస్‌గా వ్యవహరించడం అలా కథ సాగిపోతుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఇదే విషయాన్ని పూజా హెగ్దే తన నోటితోనే చెప్పింది. ‘ఓ కార్పొరేట్ కంపెనీలో నేను, బన్నీ పనిచేస్తుంటాము. ఆఫీస్‌లో బన్నీకి నేను బాస్‌గా కనిపించబోతున్నాను. ఈ క్రమంలో మా ఇద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’ అని చెప్పుకొచ్చింది. మరి ఆ రెండు సినిమాలు కలిపితే అల వైకుంఠపురమా.. లేకుంటే మరేమైనా కొత్త కథ ఉంటుందా..? అనేది తెలియాలంటే 2020 సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.

Interesting Update On Ala Vaikunthapurramloo Movie:

Interesting Update On Ala Vaikunthapurramloo Movie  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs