Advertisement
Google Ads BL

సుక్కు చేతుల మీదుగా ప్లే బ్యాక్ టీజర్ రిలీజ్!


క్రాస్ టైమ్ కనెక్షన్ కాన్సెప్ట్ తో వస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్లే బ్యాక్ టీజర్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా విడుదల

Advertisement
CJ Advs

కవిత పెద్దినేని సమర్పణలో ప్రసాద్ రావు పెద్దినేని నిర్మాతగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్లే బ్యాక్. ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ...

చిన్న సినిమాలు బాగా ఆడుతున్న రోజులివి. ఈ సినిమాలో పనిచేసిన అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. కమ్రాన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. కెమెరామెన్ బుజ్జి తక్కువ టైమ్ లో బాగా తీశాడు. నేను చెయ్యాలనుకున్న కథ ఈ ప్లే బ్యాక్, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. హిట్ అయ్యే ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. హరిప్రసాద్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుంది అన్నారు.

డైరెక్టర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ...

హీరో దినేష్ తేజ్ కష్టపడి చేశాడు, అనన్య కథ విని వెంటనే ఒప్పుకుంది. డిఫరెంట్ వేరియేషన్స్ లో ఈ అమ్మాయి నటించింది. పెద్ద కథను కేవలం 35 రోజుల్లో పూర్తి చేశాను, అందుకు కారణం కెమెరామెన్ బుజ్జి. ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి బొంతల ఈ సినిమాను అర్థం చేసుకొని బాగా కట్ చేశాడు. టీవీ 5 మూర్తి మా సినిమాలో మంచి పాత్ర చేశాడు. సుకుమార్ నాకు తమ్ముడు... నేను, సుకుమార్ 25 ఏళ్లుగా ఫ్రెండ్స్. మీడియా సపోర్ట్ తో ఈ సినిమా మరింత ఎక్కువ ప్రేక్షకులకు చేరువవుతుంది అనుకుంటున్నట్లు తెలిపారు.

టీవీ5 మూర్తి మాట్లాడుతూ...

నాకు హరి ప్రసాద్ చెప్పిన కథ విని థ్రిల్ ఫీల్ అయ్యాను. కొత్త కాన్సెప్ట్ తో హరి గారు మీ ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో అన్ని ఇలాంటి కాన్సెప్ట్స్ తోనే సినిమాలు వస్తాయని అనుకుంటున్నాను. ఆడియన్స్ ఈ పాయింట్ కు కనెక్ట్ అవుతారని భావిస్తూ సెలవు తీసుకుంటున్న అన్నారు.

క్రియేటివ్ ప్రొడ్యూసర్ డీజె.రాజు మాట్లాడుతూ...

మీడియా వారికి, సుకుమార్ గారికి థాంక్స్. అందరికీ కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. మా సినిమా టీజర్ నచ్చితే మీరందరూ సపోర్ట్ చెయ్యండి. డైరెక్టర్ హరి రాసుకున్న థ్రిల్లింగ్ పాయింట్ ను కెమెరామెన్ బుజ్జి అందంగా తెరమీద చూపించారు. అనన్య, అర్జున్ కళ్యాణ్, స్పందన, ఐశ్వర్య పాండే, దీప్తి, టీవీ 5 మూర్తి, ఆనంద చక్రపాణి బాగా నటించారు. ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి బాగా కట్ చేసాడు, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ను హరి ప్రసాద్ గారు చక్కగా చూపించారన్నారు.

డైరెక్టర్ సూర్యప్రతాప్ మాట్లాడుతూ..

చిన్న సినిమాలు ఈ మధ్య బాగా ఆడుతున్నాయి. అందుకు కారణం మీడియా. అలాగే ప్లే బ్యాక్ సినిమాను కూడా మీడియా సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్న. టీజర్ బాగుంది, సినిమా అంతకంటే బాగుంటుందని నమ్ముతున్నాను. నిర్మాత ధనుంజయ్ గారికి, డైరెక్టర్ హరి ప్రసాద్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.

హీరోయిన్ అనన్య మాట్లాడుతూ...

ప్లే బ్యాక్ కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులకు ఈ సినిమా గుర్తుండి పోతుంది. మల్లేశం సినిమా తరువాత డైరెక్టర్ హరి గారు నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. టీజర్ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. మా సినిమాకు పని చేసిన ప్రతిఒక్కరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

హీరో దినేష్ తేజ్ మాట్లాడుతూ...

మా సినిమా టీజర్ ఫంక్షన్ కు సుకుమార్ గారు రావడం సంతోషం. నాకు డైరెక్టర్ ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడే నచ్చింది. నా కెరీర్ కు ఈ సినిమా ఒక మైల్ స్టోన్ అవుతుంది అనుకుంటున్నాను. మా చిత్రంలో నటించిన అందరూ నటీనటులు, టెక్నీషియన్స్ కు థాంక్స్ తెలుపుతున్నాను. మా సినిమాకు ఆడియన్స్ సపోర్ట్ కావాలని కోరారు.

హీరో అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ...

మా ప్లే బ్యాక్ చిత్ర టీజర్ లాంచ్ చెయ్యడానికి వచ్చిన  సుకుమార్ గారికి థాంక్స్, కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.

ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ...

కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఆ వరుసలో ప్లే బ్యాక్ సినిమా ఉంటుంది. ఎడిటర్ గా నాకు ఈ సినిమాతో మంచి పేరు వస్తుందని భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్ మాట్లాడుతూ...

నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ హరిప్రసాద్ గారికి ధన్యవాదాలు. మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. ముఖ్యంగా రీ రికార్డింగ్ బాగా వచ్చింది. కొత్త కథ, కథనాలతో వస్తున్న ఈ సినిమా అందరికి నచ్చుతుంది అనుకుంటున్న అన్నారు.

Sukumar Launches Play Back Movie Teaser:

Play Back Movie Teaser Launch Event Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs