Advertisement
Google Ads BL

90ML ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్ ఇవే!


కరీంనగర్ లో ఘనంగా జరిగిన 90ml ప్రీ రిలీజ్ ఈవెంట్!!

Advertisement
CJ Advs

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో హీరోగా యువతలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ ఇప్పుడు 90ML తో మనముందుకు రాబోతున్నాడు. నేహా సోలంకి హీరోయిన్ గా కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి యర్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు.

డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కరీంనగర్ లో ఏర్పాటు చేయగా, భారీ జనసందోహం మధ్య జే మీడియా అధినేత నరేంద్ర గారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తదితర రాజకీయనాయకులు ముఖ్య అతిధులుగా విచ్చేయగా, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా మరియు ఆట సందీప్ వంటి వారు ఆటలు, డాన్సులు, పాటలతో అందరినీ అలరించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘డాన్సులు, ప్రేమ, ఎమోషన్స్ మరియు పాటలు అన్ని అనుకున్నట్టుగా తీయడానికి సహకరించి నన్నెంతగానో సపోర్ట్ చేసిన నా హీరో కార్తికేయకి ధన్యవాదాలు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు మీకు ఎంత నచ్చాయో అర్ధమవుతుంది అందుకు కారణం, అద్భుతమైన లిరిక్స్ ని అందించిన చంద్రబోస్ గారు, ట్యూన్స్ అందించిన అనూప్ రూబెన్స్ గారు. అలాగే డిసెంబర్ 5 న విడుదలయ్యే మా చిత్రం కూడా మీకు కచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు.

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ... ‘‘డిసెంబర్ 5 న విడుదలవ్వబోతున్న 90ML పాటలని ఎంత పెద్ద హిట్ చేశారో సినిమాని అంతకంటే పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నాను. ఈ చిత్రంలో చాలా హైలెట్స్ ఉన్నాయి, ముఖ్యంగా కార్తికేయ డాన్స్ ఇరగదీసాడు. కార్తికేయ అంత బాగా చేస్తాడని నాక్కూడా తెలియదు, మీరు కూడా ఇప్పటి వరకు చూసుండరు. నేహా సోలంకి ఈ చిత్రంలో హీరోయిన్ గా అద్భుతంగా నటించింది. కార్తికేయకి, తనకి మధ్య చిత్రంలో నడిచే ప్రేమ సన్నివేశాలు చాలా కొత్తగానూ ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. ఫైట్స్, కామెడీతో పాటు మంచి ఎమోషనల్ సన్నివేశాలతో 90ML పూర్తి కమర్షియల్ ఎంటెర్ టైనర్ గా రాబోతుంది. దర్శకుడు శేఖర్ రెడ్డి గారు కథ చాలా అద్బుతంగా ప్రజెంట్ చేశారు. నిర్మాత అశోక్ రెడ్డి గారు మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు’’ అంటూ పాట పాడి అందరినీ అలరించారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ... ‘‘RX100 తరువాత గుణ 369, గ్యాంగ్ లీడర్ చేసాను.. ఇప్పుడు 90ML చేస్తున్నాను. నేను ఎన్ని క్యారెక్టర్స్ చేసినా మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. అందుకు తగ్గట్టుగా మీరు నన్ను ఆదరిస్తూ వచ్చారు అందుకు ధన్యవాదాలు. కరీంనగర్ లో ఇప్పటివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదన్నారు కానీ తెలంగాణాలో అతి పెద్ద ఈవెంట్ ఇక్కడే మొదలైంది. ఇక్కడే తెలంగాణా ఉద్యమం పుట్టింది. కరీంనగర్ లో మొదలైన ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని నమ్ముతూ ఈ రోజు మేమిక్కడికి వచ్చాము. ఈరోజుతో మాకు పూర్తి నమ్మకమొచ్చింది. మన రాష్ట్రంలాగే మా చిత్రం కూడా విజయం సాధిస్తుంది’’ అని అంటూ హీరోయిన్ నేహా సోలంకితో తెలుగులో తెలంగాణ యాసలో మాట్లాడించారు.

నేహా సోలంకి మాట్లాడుతూ... ‘‘అందరూ మంచిగున్నారా, ఫ్యామిలీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అందరూ మంచిగున్నారా? 90ML ట్రైలర్ చూసిన్రా, మంచిగుందా? పాటలు ఇన్నారా, మంచిగున్నాయా, డాన్సులు మంచిగున్నాయా? నేను మంచిగున్నానా, నచ్చినానా మీకు? 90ML సినిమా RX100 కన్నా కూడా ధూంధాం ఉంటది. డిసెంబర్ 5 న సినిమా రిలీజ్ అవుతుంది అందరూ చూస్తున్నారా, ఇంట్లో అందరినీ తీస్కపోవాలె’’ అంటూ హీరో చెప్పే తెలంగాణ వాక్యాలకి ఇంకొన్ని సరదా మాటలు కలిపి అందరినీ ఆకట్టుకున్నారు.

రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ... ‘‘90ML ప్రమోషన్స్ లో భాగంగా మన కరీంనగర్ కి రావడం చాలా సంతోషంగా ఉంది. హీరో కార్తికేయ అన్నకి ఈ సినిమాలో రెండు పాటలు నాతో పాడించిన అనూప్ రూబెన్స్ గారికి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత అశోక్ గారికి నా కృతజ్ఞతలు. ఈ చిత్రం ఆల్కహాల్ ని ఎంకరేజ్ చేయదు, మంచి కథ, మాటలు, కామెడీ, పాటలు మరియు ఫైట్స్ తో మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులని అలరించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. డిసెంబరు 5 న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నానంటూ’’ అంటూ తను చిత్రంలో పాడిన రెండు పాటలని పాడి వినిపించడమే కాక కార్తికేయతో కలిసి డాన్స్ కూడా చేశారు.

90ML Pre Release Event Highlights:

Celebrities Speech at 90ML Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs