టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్నా నటీనటులుగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం ‘భీష్మ’. ఇప్పటికే దాదాపు సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. మరోవైపు.. ‘భీష్మ’కు సంబంధించిన పోస్టర్లు, ఫస్ట్ గింప్స్ వచ్చేశాయి. మాస్, క్లాస్, లవ్, రొమాన్స్ షేడ్స్ ఇలా ఏవీ తక్కువ లేకుండా అన్నీ కనిపించేలా విడుదల చేసిన పోస్టర్లు నెటిజన్ల, సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి. రష్మిక, నితిన్ కలిసి.. నడుము ఉన్న పోస్టర్ అయితే కుర్రకారుకు పిచ్చెక్కించింది. రష్మిక యాక్టింగ్ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని.. నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే స్టార్ హీరోల సినిమాలు ఉండటం.. పోటీ గట్టిగానే ఉంటుందని భావించిన చిత్రబృందం ముందుగానే డేట్ ఫిక్స్ చేసుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే మహా శివరాత్రి ఒకరోజు ముందు లేదా వెనుక రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు యోచిస్తున్నారట. అంటే.. పండుగ కలిసొస్తుందని.. శివుడు ఓ చూపు చూస్తే సూపర్ హిట్టవుతుందని చిత్రబృందం అనుకుంటుందేమో!. వచ్చే ఏడాది రిలీజ్‌కు ఇప్పట్నుంచే అంతా పక్కా ప్లాన్‌తో ప్రమోషన్స్ షురూ చేసుకుని హిట్ కొట్టాలని దర్శకనిర్మాతలు ఎత్తులు వేస్తున్నారట. అంతేకాదు ప్రమోషన్స్‌కు ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా సరే వదులుకోకూడదని ఫిక్స్ అయ్యారట.
ఇక అసలు విషయానికొస్తే.. సంక్రాంతి తర్వాత లేదా.. ఫిభ్రవరి మొదటి వారంలో ‘భీష్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చిత్రబృందం యోచిస్తోందట. అయితే ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించాలని నితిన్‌కు డైరెక్టర్, నిర్మాత చెప్పారట. తన గురువు.. దేవుడుగా భావించే పవన్‌కు ఫోన్ చేసి సార్ ఇదీ పరిస్థితి అని వివరించాడట. అయితే పవన్ వస్తానని చెప్పాడా..? లేకుంటే వీలుకాదని చెప్పాడా..? గ్రీన్ సిగ్నల్ వచ్చిందా..? లేదా..? అనే విషయం తెలియరాలేదు.
ఇప్పటికే నితిన్ సినిమాలకు సంబంధించిన ఫంక్షన్‌లకు పవన్ హాజరైన విషయం విదితమే. అయితే ఈ సినిమాకు వస్తాడో రాడో మరి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో ఘోరంగా పార్టీనే కాదు.. రెండు చోట్ల పోటీచేసినప్పటికీ పవన్.. బొమ్మ తిరగబడటంతో మళ్లీ ఈ పరిస్థితులు రాకూడదని జిల్లాల బాట పట్టాడు. మరి ఈ బిజిబిజీ షెడ్యూల్ ‘భీష్మ’ ఫంక్షన్‌కు పవన్ ఏ మాత్రం వస్తాడో వేచిచూడాల్సిందే.