‘ఖైదీ’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు ‘దొంగ’గా రానున్నాడు. ఈ చిత్రంలో కార్తీకి వదిన, సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై జీతు జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దొంగ’ పోస్టర్స్, టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
‘దొంగ’ నుంచి ఫస్ట్ సాంగ్ వీడియోను ఆదివారం విడుదల చేశారు. ‘రూపి రూపి’ అంటూ సాగే హుషారైన పాటని గోవాలో కలర్ఫుల్‌గా పిక్చరైజ్ చేశారు. లాంగ్ హెయిర్‌తో, కొత్త తరహా స్టైలింగ్‌తో కార్తీ సాంగ్‌లో ఎనర్జిటిక్ గా ఉన్నారు. ‘... ఎవ్వరినీ వదలదుగా నా స్ట్రీట్ స్మార్ట్ చిలిపి తనం.. మాయలోన పుట్టి మాయలోన పెరిగినాను’ అంటూ సాగే ఈ పాట హీరో క్యారెక్టరైజేషన్‌ను తెలిపేలా సాగుతుంది. రామజోగయ్య శాస్త్రీ ఈ పాటని రాయగా.. రంజిత్ గోవింద్ పాడారు. గోవింద్ వసంత సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు.
కాగా.. యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్, నిఖిల విమల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్, సంగీతం: గోవింద్ వసంత, నిర్మాతలు: వయాకామ్ 18 స్టూడియోస్, సూరజ్ సదానా, దర్శకత్వం: జీతు జోసెఫ్.