అనతి కాలంలోనే టాప్ కామెడీ షోగా ఎదిగి మంచి ఆదరణ పొందిన షో ‘జబర్దస్త్’. ఈ షోకు జడ్జిగా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబు కొన్ని అనివార్య కారణాల వల్ల బయటికొచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కారణాలేంటి..? అనేది మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు..? ఈ ఒక్క కారణం తప్ప మిగతా అన్ని విషయాలను నాగబాబు తన యూ ట్యూబ్ చానెల్ ‘మై చానెల్ నా ఇష్టం’ వేదికగా పంచుకుంటున్నాడు. ఇక అసలు విషయానికొస్తే.. నాగబాబు స్థానాన్ని ఎవరైతే భర్తీ చేస్తారని కొన్ని రోజులుగా వేట సాగించిన మల్లెమాల యాజమాన్యం ఫైనల్‌గా ఓ కత్తిలాంటి ఖతర్నాక్ కమెడియన్‌ను సెలక్ట్ చేసుకుంది.
ఆయన మరెవరో కాదండోయ్.. అటు వెండితెరపై.. ఇటు బుల్లి తెరపై యమా బిజిబిజీగా ఉండే కమెడియన్ అలీ. తాను బిజీగా ఉన్నాను..‘జబర్దస్త్’కు రాలేనని చెప్పినప్పటికీ అతి బలవంతంగా మీరు రావాల్సిందేనని పట్టుబట్టి మరీ పట్టుకొచ్చారని టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలి. అయితే నాగబాబు గుడ్ బై చెప్పినప్పట్నుంచి సోలో జడ్జిగానే రోజా వ్యవహరిస్తున్నారు. ఇలా ఎన్ని రోజులు ఒకర్నే మేనేజ్ చేసుకుంటూ రావడమని.. అలీని పట్టుకొచ్చారట.
ఉన్నట్టుండి ఆదివారం విడుదలైన ‘జబర్దస్త్’ ప్రోమోలో అలీ ప్రత్యక్షమవ్వడంతో అందరూ కొత్త జడ్జి వచ్చేశాడోచ్.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే అలీ ఈ షోకు గెస్ట్‌గా వచ్చారా..? లేకుంటే టెంపరరీనా..? లేదా పర్మినెంట్‌గానే నాగబాబు స్థానాన్ని భర్తీ చేస్తారా..? అనేది తెలియాలంటే డిసెంబర్-6న రానున్న ఫుల్ ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే మరి.