Advertisement
Google Ads BL

ఏసియన్ ముక్తా సినిమాస్ ‘ఎ2’ ప్రారంభం


సినిమా మల్టీప్లెక్స్‌లలో ‘ఏసియన్ బ్రాండ్’ నలుదిశలా వ్యాప్తిస్తుంది. హైదరాబాద్‌లో పదో మల్టీ ప్లెక్స్‌ను నారపల్లిలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, నిర్మాత శిరీష్, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి‌లు ప్రారంభించారు. రాజకీయ, సినీ ప్రముఖలతో ‘ఏసియన్ ముక్తా సినిమాస్’ ఏ2 ప్రారంభం గ్రాండ్‌గా జరిగింది. మిడిల్ క్లాస్ పీపుల్‌కి అందుబాటులో ఉండే విధంగా మల్టీప్లెక్స్‌లను అందుబాటులోకి తెచ్చిన ఘనత ఏసియన్ గ్రూప్‌కే దక్కుతుంది.

Advertisement
CJ Advs

వేగంగా విస్తరిస్తున్న జంట నగరాలలో ఏసియన్ మల్టీ‌ప్లెక్స్‌లు సాధారణ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మల్టీ ప్లెక్స్‌లను డిజైన్ చేయడంలో ఏసియన్ గ్రూప్ సక్సెస్ అయ్యింది. అందుకే అనతి కాలంలో పది మల్టీ‌ప్లెక్స్‌లను నిర్మించగలిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిలతో పాటు నిర్మాతలు శిరీష్, గోవర్దన్‌లు, ఏసియన్ సినిమాస్ అధినేత్ సునీల్ దాస్ నారాంగ్, ఏసియన్ గ్రూప్ ఛైర్మన్ నారాయణ దాస్ కె.నారంగ్, డిస్ట్రిబ్యూటర్ సదానంద్ గౌడ్, శ్రీధర్, కాంప్లెక్స్ యజమాని జనార్ధన్‌లతో పాటు పలువురు ప్రముఖలు హాజరయ్యారు.

 ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ఈ  కార్యక్రమానికి అటెండ్ కావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా అనేది సామాన్యులకు అందుబాటులో ఉండే వినోదం. ఆ వినోదాన్ని సామాన్యులకు అందుబాటులో ఉంచుతున్న ఏసియన్ సంస్థకు నా శుభాకాంక్షలు’ అన్నారు.

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘మల్టీ ప్లెక్స్‌లు అంటే సామాన్యులకు భారంగా ఉండే పరిస్థితి ఉంది. ఏసియన్ గ్రూప్ సామాన్యలకు అందుబాటులో వినోదం ఉంచడం చాలా సంతోషంగా ఉంది. క్వాలిటీ మూవీ చూడాలంటే చాలా దూరం ప్రయాణం చేయాల్సిన పని లేకుండా అన్ని చోట్లా ఏసియన్ మల్టీ ప్లెక్స్‌లను నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్క్రీన్ ఓపెనింగ్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. 

ఏసియన్ గ్రాప్ ఛైర్మన్ నారాయన్ దాస్ కె నారంగ్  మాట్లాడుతూ.. ‘ఏసియన్ జంటనగరాల్లో నిర్మించిన పదో మల్టీ ప్లెక్స్ ఇది. నగరం వేగంగా అభివృద్ది చెందుతుంది.  అందుకే మల్టీ ప్లెక్స్ లను అందరికీ అందుబాటులో ఉండేవిధంగా నిర్మిస్తున్నాము. ఎ మల్టీ ప్లెక్స్ లేని విధంగా ఎసియన్  మల్టీ ప్లెక్స్ సామాన్యులకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే సినిమా అనేది మిడిల్ క్లాస్ వారికి సామాన్యులకు అందుబాటులో ఉండే వినోదం. హైదారాబాద్ తో పాటు కర్నాటక, ఆంధ్రాలలో కూడా ఎసియన్ మల్టీ ప్లెక్స్ లను వచ్చే యేడాది నిర్మిస్తాము. నారాపల్లిలో ఏసియన్ మల్టీ ప్లెక్స్  నిర్మించడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.

Aisian Muktha Cinema A2 Opening :

Aisian Muktha Cinema A2 Opening   
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs