హీరోయిన్‌‌తో హాటల్‌లో డైరెక్టర్..భార్య రావడంతో..!


సినీ ఇండస్ట్రీలో లవ్, లవ్ మ్యారేజీ, ఎఫైర్లు, పెళ్లిళ్లు చేసుకోవడం.. ఆ పెళ్లి పెటాకులవ్వడం షరా మామూలే. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఎప్పుడు ఎవరు ఎవర్ని ప్రేమిస్తారో.. ఎప్పుడు విడిపోతారో.. ఎప్పుడు డేట్ చేస్తారో..? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో కూడా తెలియని పరిస్థితి. అయితే ఆ కల్చర్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలకూ పాకింది. ఈ మధ్య టాలీవుడ్‌లోనూ ఇలాంటి ఘటనలు ఎక్కువగానే చోటు చేసుకుంటున్నాయ్. అయితే కొన్ని బయటపడుతుంటే మరికొన్ని మాత్రం మరుగున పడుతున్నాయ్. టాలీవుడ్ కుర్ర డైరెక్టర్ రియల్ కథపై ఓ లుక్కేయండి.

ఈ మధ్యే ఓ సంచలన సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ సింగిల్ సినిమాతోనే తన రేంజ్ ఏంటో చాటుకున్నాడు. లవ్ మ్యారేజీ.. ఇటు లైఫ్.. ఇటు డైరెక్టర్‌గా కెరీర్ అంతా సాఫీగానే ఉంది. అయితే ఇక్కడే ఆ డైరెక్టర్ అడ్డదారి తొక్కాడట. తన ఫస్ట్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన హీరోయిన్‌తో ఎఫైర్ నడుపుతున్నాడట. అంతేకాదు.. ఆ భామ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందట. ఆయన ఎఫైర్‌ వరకే అనుకుంటే.. హీరోయిన్ మాత్రం ప్రేమా.. దోమా అని హోటళ్లు.. రెస్టారెంట్‌లు, బార్లు, పబ్‌ల వెంబడి జంటగానే ఎంచక్కా తిరిగేస్తున్నారట.

భర్త వ్యవహారంపై అనుమానమొచ్చిన భార్య ఓ రోజంతా అతనికి తెలియకుండా ఫాలో అయ్యి.. చివరికి ఓ హోటల్‌లో హీరోయిన్‌తో రొమాన్స్‌లో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందట. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన భార్య... భర్త, ఆ హీరోయిన్‌ను ఎడాపెడా వాయించేసిదట. అయినప్పటికీ ఆ డైరెక్టర్‌లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదట. అంతేకాదు.. భార్యను వదులుకొని.. ఆ హీరోయిన్‌నే పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యాడని ఫిల్మ్‌నగర్‌లో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. కాగా.. ఆ హీరోయిన్ మాత్రం ఫస్ట్ విజయం సాధించడంతో హీరోయిన్‌గా ఆమె కెరీర్ తెలుగులో స్థిరపడిపోయింది. అంతేకాదు వరస అవకాశాలు కూడా వస్తున్నాయి. డైరెక్టర్ పరిస్థితి మాత్రం ఇప్పుడు ఎటూ పాలుపోకుంది. మరి భార్యను వదులుకుని హీరోయిన్‌తోనే ఊరుగుతాడో.. లేకుంటే బుద్ధి తెచ్చుకుని భార్యతోనే కలిసుంటే కలదు సుఖం అన్నట్లుగా బతికేస్తాడో వేచి చూడాల్సిందే.

News About Director and Heroine Romance..!:

News About Director and Heroine Romance..!  
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES