Advertisement
Google Ads BL

లేట్ అయితేనేం.. కొట్టాడుగా హిట్టు..!!


గత ఏడాది నవంబర్ నుండి నిఖిల్ అర్జున్ సురవరం సినిమా ఇప్పుడు విడుదల, అప్పుడు విడుదల అంటూ వార్తలు రావడమే కానీ.. సినిమా మాత్రం థియేటర్ లోకి వచ్చింది లేదు. ముందు నవంబర్ 2018 అన్నాడు. తర్వాత ఏప్రిల్ 2019 కి మారింది. నిఖిల్ కూడా అర్జున్ సురవరం సినిమా ప్రమోషన్స్ ని డిఫరెంట్ గా మొదలెట్టాడు. ఏమైందో ఏమో మళ్ళీ జూలై 30 కి వెళ్లిన అర్జున్ సురవరానికి మధ్యలో టైటిల్ కాంట్రవర్సీ. ముద్ర టైటిల్ మాదంటూ.. కొంతం మంది గొడవ చెయ్యగా... తన సినిమా టైటిల్ ని అర్జున్ సురవరంగా మార్చిన నిఖిల్... ఈ సినిమా విడుదల విషయంలో చాలా సిల్లీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామని చెప్పాడు. ఎట్టకేలకు భారీ ప్రమోషన్స్ తో నిఖిల్ అర్జున్ సురవరం నిన్న శుక్రవారం విడుదలైంది.

Advertisement
CJ Advs

సినిమాకి ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా హిట్ టాకిచ్చేసారు. కథ, కథనం, నిఖిల్ నటన, మ్యూజిక్, నేపధ్య సంగీతం, కామెడీ, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అన్ని సినిమాకి హైలెట్ గా నిలవగా.... దర్శకత్వం, సెకండ్ హాఫ్ లాగ్, ఎడిటింగ్ లో గందరగోళం, స్క్రీన్ ప్లే డల్ గా ఉండడంతో.. క్రిటిక్స్ ఈ సినిమాకి 3 రేటింగ్ ఇవ్వకపోయినా.. సినిమా బావుంది అనేసారు. మరి నిఖిల్ తన సినిమాతో లేట్ గా కాదు.. సూపర్ లేట్ అయినా.. లేటెస్ట్ గా హిట్ కొట్టాడనిపిస్తుంది. అయితే అర్జున్ సురవరం సినిమాకి ఈ వారం గొప్ప పోటీ లేకపోవడం కలిసొచ్చిందనే చెప్పాలి. రెండు మూడు చిన్న  సినిమాలు విడుదలైనా అవి తమ ప్రతాపం చూపలేకపోవడం, రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదలకు బ్రేక్ పడడం నిఖిల్ సినిమాకి కలిసొచ్చింది. 

Positive Talk to Nikhil Arjun Suravaram Movie:

Arjun Suravaram Movie Talk at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs