Advertisement
Google Ads BL

‘సరిలేరు..’కు గ్రాండ్‌గా ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా..!


టాలీవుడ్ సూపర్‌స్టార మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా హిట్ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేసింది. 2020 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి ఇంతవరకూ ప్రమోషన్ చేసిన దాఖలాల్లేవ్. అప్పుడప్పుడు సింగిల్ అంటూ చిన్నపాటి లుక్స్ తప్ప చిత్రబృందం చేసిందేమీ లేదు. ఈ మధ్యే టీజర్ రిలీజ్ చేసిన చిత్రబృందం.. అటు యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్ చేస్తూ.. ఇటు మహేశ్ అభిమానుల ఆదరాభిమానులు పొందింది. ఆ తర్వాత ప్రతీ మండే.. ఓ సర్‌ఫ్రైజ్ ఇవ్వబోతున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Advertisement
CJ Advs

ఇక అసలు విషయానికొస్తే... ఒక్కొ సాంగ్‌ లెక్కన రిలీజ్ చేస్తే డిసెంబర్ 30న ఫైనల్ పాట రానుంది. అయితే జనవరి 11న సినిమా రిలీజ్ కానుండటంతో జనవరి 05న ప్రీ రీలజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ వేడుకకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం లేదా.. ఎన్టీఆర్‌ స్డేడియంను ఫిక్స్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ ఫంక్షన్‌కు చీఫ్ గెస్ట్‌గా తెలంగాణ మంత్రి కేటీఆర్‌, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను ఆహ్వానించాలని భావిస్తున్నారట.

ఎలాగో మహేశ్ తండ్రి కృష్ణ అండ్ ఫ్యామిలీ కచ్చితంగా వస్తుంది. సో.. ఘట్టమనేని వీరాభిమానులు ఇక పండుగే పండుగ అన్న మాట. వాస్తవానికి ఇంతవరకూ సినిమా ప్రమోషన్‌ విషయం చిత్రబృందం చాలా డల్‌గా ఉంది.. అందుకే ప్రీ రిలీజ్‌ను గ్రాండ్‌గా నిర్విహించాలని చిత్రబృందం సరిలేరు కోసం స్కెచ్‌లు వేస్తోందట. మరి ఈ ప్లాన్‌లో ఎంతవరకు నిజముందో..? అసలు ప్రమోషన్స్ చేసే ఉద్దేశం ఉందా..? లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే.

Sarileru Neekevvaru Cinema Units Plans Pre Release Funtion.. Chief Guest Details Here..:

Sarileru Neekevvaru Cinema Units Plans Pre Release Funtion.. Chief Guest Details Here..  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs