నాగబాబు జబర్దస్త్ జర్నీ సక్సెస్ ఫుల్‌గా ముగిసింది. ఆయనకి నచ్చి వెళ్ళాడో అలిగి వెళ్ళాడో అనేది తెలియదు కానీ.. జబర్దస్త్‌లో నాగబాబు ప్రస్థానం అయితే ముగిసినట్లే. అయితే నాగబాబు జబర్దస్త్ టీంని తనవైపు లాక్కుని ఎలాగైనా మల్లెమాల టీంకి చెక్ పెట్టాలని చూస్తున్నాడు అనే వార్తలే ఆయన ఏ కారణంతో వెళ్లాడు అనేది తెలియజేస్తుంది. కానీ నాగబాబు లాగితే మేము వెళ్లము అని చెప్పకనే చెబుతూ... జబర్దస్త్ లో స్కిట్స్ చేసుకుంటున్న జబర్దస్త్ కమెడియన్స్, నాగబాబు వీర విధేయులే నాగబాబుకు షాకిచ్చారు. కారణం మరో జడ్జ్ రోజా చెప్పినట్టు.. జబర్దస్త్ ఆదుకుని అన్నం పెట్టిందే కాదు, జబర్దస్త్ ని వదిలి వెళ్ళాక మళ్ళీ జబర్దస్త్ లోకి అడుగుపెట్టడానికి వేణు, ధనరాజ్.. ఎంతగా ఇబ్బంది పడ్డారో అని రోజా చేసిన హెచ్చరిక పనిచేయడమే అంటున్నారు.
మరో పక్క జబర్దస్త్ నుండి కమెడియన్స్‌ని జారకుండా రోజా చేసిన పనికి మెచ్చిన మల్లెమాల ప్రొడ్యూసర్స్ రోజా పారితోషకం అమాంతం పెంచినట్లుగా ఫిలింనగర్ టాక్. రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ... తనకి కావల్సిన డబ్బు కోసం రోజా జబర్దస్త్‌ని వదలకుండా అంటిపెట్టుకుని వేళ్ళాడింది. అయితే రోజాకి, నాగబాబు బయటికెళ్ళడం మాత్రం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇంతకుముందు ఇద్దరు జడ్జ్‌లకు ఇచ్చే పారితోషకాన్ని ఇప్పుడు ఒక జడ్జ్ అయ్యేసరికి ఆ జడ్జ్ పారితోషకం డబుల్ చెయ్యడం వాళ్ళకి పెద్ద ఇబ్బందిగా అనిపించడం లేదట. మరి జడ్జ్‌గా మరో సెలెబ్రిటీ దొరికినా... మొదట్లో వారికీ పారితోషకం అంతగా ఉండకపోవచ్చని టాక్ ఉంది.