Advertisement
Google Ads BL

‘రూల‌ర్‌’ ఫంక్షన్‌కు ముఖ్య అతిథెవరో తెలుసా!


న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రూల‌ర్‌’. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ నిన్నటితో పూర్తయ్యింది. అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న  ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మ‌రోవైపు ప్రమోష‌న్లను కూడా భారీగా చేయ‌డానికి మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. డిసెంబర్ 15న ఆడియో ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట. కాగా సినిమా రిలీజ్‌కు ముందు ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కలిపి ఒక్కటే ఫంక్షన్ పెట్టాలని దర్శకనిర్మాతలు ఫైనల్ చేశారట. అయితే ఈ కార్యక్రమానికి ఎవర్ని చీఫ్ గెస్ట్‌గా పిలవాలని చిత్రబృందం ఆలోచనలో పడిందని తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

వాస్తవానికి ఇప్పట్లో టాలీవుడ్ నుంచి ఎవర్ని పిలిచే పరిస్థితుల్లేవ్.. ఒక వేళ పిలవాలనుకుంటే మెగాస్టార్ చిరంజీవినో.. లేకుంటే అక్కినేని నాగార్జుననో లేకుంటే మరో సీనియర్ హీరోనో పిలవాల్సి వస్తుంది. వారిని పిలవడానికి బాలయ్య సాహసించరు.. ఒకవేళ పిలిచినా వస్తారో రారో అనేది తెలియని పరిస్థితి. ఎందుకు రారు.. అనేది ఇక్కడ అప్రస్తుతం.. అసందర్భం కూడా. అందుకే ఆ చాయిస్‌ బాలయ్యకే వదిలేశారట. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎవర్ని తీసుకోవాలని అని బాలయ్యనే అడగ్గా ఆయన ఒక గంట టైమ్ తీసుకుని.. బావ చంద్రబాబును పిలిపిద్దామని చెప్పారట. 

అయితే గెస్ట్‌గా రావాలని పిలిపిస్తే మాత్రం బాబు ఏ మాత్రం కాదనరు.. తప్పకుండా వస్తారు ఇందులో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు అవసరమైతే నందమూరి ఫ్యామిలీని మొత్తం దింపాలనే యోచన కూడా బాలయ్య చేస్తున్నారని టాక్ నడుస్తోంది. వాస్తవానికి ఇప్పుడు బాబుకు జనాల్లోకి వెళ్లడమే కావాలి.. నలుగురి నోళ్లలో చంద్రబాబు అనే పేరు నానాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయ్. అంతేకాదు.. బాలయ్య-మామయ్య ఇద్దరూ కలుసుకుని కూడా చాలా రోజులే అయ్యింది.

అందుకే పనిలో పనిగా ఒకే స్టేజ్‌పై కలిసినట్లుంది.. నందమూరి, నారా, టీడీపీ అభిమానులను అలరించినట్లుంది అని బాలయ్య ఈ ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా.. బామ్మార్థి-బావ ఇద్దరూ ఒకే స్టేజ్‌ కనిపించడం ఇదేం మొదటిసారి కాదు. సో.. ముఖ్య అతిథి చంద్రబాబు అంటూ వస్తున్న పుకార్లలో ఏ మాత్రం నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

News About Balayya Ruler Movie Functon Chief Guest..!:

News About Balayya Ruler Movie Functon Chief Guest..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs