Advertisement
Google Ads BL

‘పటారుపాళెం ప్రేమ కథ’ నుంచి పాటొచ్చింది


హీరో శ్రీ విష్ణు  చేతుల మీదుగా పటారుపాళెం ప్రేమ కథ సాంగ్ విడుదల.  

Advertisement
CJ Advs

జె.ఎస్ ఫిలిమ్స్ పతాకం పై దొరైరాజు వూపాటి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘పటారుపాళెం ప్రేమ కథ’ శ్రీ మానస్, సమ్మోహన హీరో హీరోయిన్ లుగా నోటిస్తున్న ఈ చిత్రం పరువు హత్యల నేపథ్యంలో, కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారం చేసుకొని తెరకెక్కించారు. ఈ సినిమాలో ‘ఏడవున్నావే ఏడవున్నావే’ అనే  తొలి పాటను హీరో శ్రీ విష్ణు నిన్న విడుదల చేసారు. 

ఈ సందర్భంగా  శ్రీ విష్ణు మాట్లాడుతూ.. నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిందే ఈ సినిమా దర్శకుడు దొరైరాజు గారు, ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా పాటను విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, పాట నేను విన్నాను పాట చాలా బాగుంది. మ్యూజిక్ లవర్స్ అందరూ ఈ పాటను విని పెద్ద హిట్టు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్టు కావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. 

దర్శకుడు దొరైరాజు మాట్లాడుతూ... ఈ సాంగ్ శ్రీ విష్ణు విడుదల చేయడం నాకు సంతోషంగా ఉంది, ఎంతో నిజాయతీగా తీసిన సినిమా ఇది. టీజర్ ని పెద్ద హిట్టు చేసిన ప్రేక్షకులు ఈ సాంగ్ ని కూడా అంతే పెద్ద హిట్టు చేస్తారని నమ్ముతున్నాను అని అన్నారు.  సినిమా టీమ్ అందరూ శ్రీ విష్ణుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు బాలు ధాకే పాల్గొన్నారు. ఈ సినిమాకు కెమెరా ఆర్ కె ములింటి.

జిఎస్ రెడ్డి సమర్పణ, వి లతారెడ్డి, వి సౌజన్యా దొరైరాజు, బి. ఆర్ బాలు, కె రామకృష్ణ ప్రసాద్ లు ఈ సినిమాను నిర్మించారు.

Sree Vishnu Launched Pataru Palem Prema Katha Movie Song:

Patarupalem Premakatha Film song released by Hero Sree Vishnu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs