టాలీవుడ్ రైటర్లలో వక్కంతం వంశీ రూటే వేరు.. ఇప్పటికే తన కథలతో సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. తండ్రి రచయిత కావడంతో ఇతనికి చిన్నతనం నుండి సాహిత్యం పట్ల, రచనల పట్ల ఆసక్తి కలిగింది. పాఠశాలలో చదివే రోజుల్లో నాటకాలలో నటించేవాడు. అలా న్యూస్‌రీడర్‌గా చేరి.. ‘చిత్రం భళారే విచిత్రం’ ద్వారా నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తండ్రి లక్షణాలను పునికిపుచ్చుకున్న వంశీ.. ఎంతో మంది జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించాడు. అది అదృష్టమో.. దురదృష్టమో కానీ రైటర్‌గా గ్రాండ్ సక్సెస్ అయిన ఆయన.. డైరెక్టర్‌గా మాత్రం అస్సలు సక్సెస్ కాలేకపోయాడు.
ఇక అసలు విషయానికొస్తే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈయన ఫస్ట్ మూవీతో అట్టర్ ప్లాప్ ఖాతాలో వేసుకున్నాడు. దీంతో కథలు రాయడం కానీ.. డైరెక్ట్ చేయడం కానీ చేయకుండా మిన్నకుండిపోయాడు. ‘ఓడిపోవడం అంటే.. ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే అడుగు అడుగు వెయ్యనిదే’ అన్నట్లుగా తొలి ప్రయత్నం ఫెయిల్ అయినంత మాత్రం కుంగిపోనక్కర్లేదు.. మరో ప్రయత్నం చేద్దాం.. సక్సెస్ అవుదామని వంశీ.. మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్స్ అయ్యాడట.
అదీ కూడా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. వంశీకి డైరెక్టర్‌గా మరో అవకాశం ఇస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. తన కుమారుడికి అట్టర్ ప్లాప్ సినిమా ఇచ్చినప్పటికీ ఆయన్ను ఆదరించాలని భావించిన అరవింద్.. యంగ్ హీరోకు కథ చెప్పాలని సూచించాడట. అది కూడా భారీ బడ్జెట్ కాకుండా మీడియంలోనే వెళ్లాలని వంశీకి ఆయన సూచించాడట. అరవింద్ సూచనతో కథ రెడీ చేసే పనిలో వంశీ నిమగ్నమయ్యాడట. అయితే ఆ హీరో ఎవరు..? అనేది మాత్రం తెలియరాలేదు. కాగా.. గతంలో పరుశురామ్‌కు కూడా ఇలాగే‘గీతా గోవిందం’ సినిమాతో బ్రేక్ ఇచ్చి.. లైఫ్ ఇచ్చిన విషయం విదితమే. వంశీకి చాన్స్ ఇచ్చినట్లు వస్తున్న వార్తలు నిజమైతే మాత్రం పంటపండినట్లే మరి.