Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్.. అసలేమైంది!


టెక్నాలజీ రోజురోజుకు పెరిగిపోతోంది.. అయితే దీన్ని పనికొచ్చే పనులకు వాడుకొనే వాళ్లు తక్కువయ్యారు.. కానీ పాడు పనులకు.. పొద్దు పోని పనులకు మాత్రం వాడుకునే వారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ రావడం.. వాటితో నెటిజన్లు ఇష్టానుసారం చేయడం పరిపాటిగా మారుతోంది. అయితే ఇక అసలు విషయానికొస్తే.. సోషల్ మీడియాలో తమిళ స్టార్ హీరో విజయ్.. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ ఇద్దరు హీరోల్లో ఎవరు బెస్ట్ డ్యాన్సర్..? అనే పోల్ వ్యవహారం అభిమానుల మధ్య చిచ్చుపెట్టింది.

Advertisement
CJ Advs

తమిళ్‌‌లో విజయ్‌ను.. తెలుగులో ఎన్టీఆర్‌ను అభిమానించే ఓ వీరాభిమాని పై విధంగా పోల్ పెట్టాడు. వాస్తవానికి ఆయన ఏదో అనుకుని పోల్ పెట్టగా ఇంకెదో జరిగిపోయింది. చివరికి ఎన్టీఆర్ అభిమానులు వర్సెస్ విజయ్ అభిమానులుగా నెట్టింట్లో పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇద్దరూ బెస్ట్ డ్యాన్సర్సే ఎవర్ని వేలెత్తి చూపలేం.. ఎవరూ అనేది మాత్రం చెప్పలేమని కొందరు నెటిజన్లు చెబుతుండగా.. మరికొందరు మాత్రం కోలీవుడ్‌లో విజయ్.. టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ అని చెబుతున్నారు. ఇంకొందరైతే అసలేంటి ఈ పోలిక.. ఈ పోల్ పెట్టినోడికి బుద్ధి లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి హీరో వారికి గొప్ప.. అంత మాత్రాన ఇలా నెట్టింట పడి మరీ కొట్టుకోవడమెందుకు..? అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే మాది తమిళనాడు అంటూ కాస్త అతి చేయగా.. మన తెలుగు వాళ్లు మాత్రం గట్టిగానే కౌంటరిచ్చారు.

వాస్తవానికి.. డ్యాన్స్ అనే విషయానికి వస్తే ఇండియా మొత్తమ్మీద టాలీవుడ్ హీరోల్ని కొట్టేవాళ్లు లేరన్నది జగమెరిగిన సత్యమని కొందరు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. జూనియర్ హీరోల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రామ్, నితిన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. సీనియర్ల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవిని ఢీ కొట్టే మొనగాడు లేడని విశ్లేషకులు చెబుతున్నారు.

Vijay vs Junior NTR.. who is the best dancer?:

Vijay vs Junior NTR.. who is the best dancer?  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs