Advertisement
Google Ads BL

పవన్‌ను ‘అలీ’ పూర్తిగా వదిలేసినట్లేనా!?


టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు.. నమ్మిన బంటుగా ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క కమెడియన్ అలీ మాత్రమే. అయితే అదేదో సామెత ఉంది కదా.. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్లుగా సినిమాల వరకూ ఇద్దరూ బెస్ట్‌.. రాజకీయాల్లోకి వచ్చాక ఇద్దరూ డిఫరెంట్. ఎన్నికలకు ముందు వరకూ వీరిద్దరి స్నేహాన్ని చూసి చాలా మంది కుల్లుకున్నారు కూడా. అంతేకాదు పవన్ సమక్షంలో అలీ జనసేనలో చేరి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అప్పట్లో అటు పవన్ అభిమానులు.. ఇటు అలీ అభిమానులు అందరూ భావించారు. అయితే అటు ఇటు తిరిగి.. చివరికి ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన, జరుగుతున్న పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే.

Advertisement
CJ Advs

ఇక అసలు విషయానికొస్తే.. పవన్‌ను అలీగా వదిలేసినట్లేనా అనేది ఇప్పుడు అందరికీ అనుమానం వస్తోంది. ఎన్ని విభేదాలున్నా సినిమాల్లో అలాంటివేమీ ఉండవనీ.. ఇవాళ తిట్టుకున్నా రేపొద్దున ఒకటవుతారని అంటుంటారు. అయితే అలీ మాత్రం అస్సలు తగ్గేది లేదన్నట్లుగా ఉన్నట్లున్నాడు. అసలేం జరిగిందంటే.. ఇటీవల ఓ ప్రముఖ షోకు అలీ, పోసాని ఇద్దరూ వెళ్లారు. ఈ సందర్భంగా యాంకర్ కొన్ని ప్రశ్నలు సంధించింది. కొన్నింటికి సమాధానం టకా టకా చెప్పేశాడు అలీ. అయితే పవన్ కల్యాణ్, రాఘవేంద్రరావు.. ఈ ఇద్దరిలో ఎవరంటే మీకిష్టం..? అనే ప్రశ్న ఎదురైంది. వాస్తవానికి పవన్ అంటే అలీకి ప్రాణం అనే విషయం తెలిసిందే. దీంతో కచ్చితంగా అలీ నోట పవన్ కల్యాణ్ అనే సమాధానం వస్తుందని అందరూ భావించారు.

అయితే.. అలీ మాత్రం పాత గొడవలు పూర్తిగా మరిచిపోలేదో.. ఏమోగానీ.. టక్కున ఏ మాత్రం ఆలోచించకుండానే ‘రాఘవేంద్రరావు అంటే నాకిష్టం’ అని నవ్వుతూ చెప్పేశాడు. దీంతో పవన్ వీరాభిమానులు, జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు ముక్కున వేలేసుకున్నంత పనైందట. వాస్తవానికి పవన్-అలీ మధ్య ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయని.. అయితే ఇవి మాత్రం బయటికి పొక్కనీయకుండా అలీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడనే టాక్ కూడా నడుస్తోంది. అందుకే ఇలా షోలో పవన్ పేరు చెప్పకుండా.. దర్శకేంద్రుడి పేరు చెప్పి తిన్నగా తప్పించుకున్నాడని తెలుస్తోంది. ఏదైతేనేం బయట మాత్రం పవన్‌ను పూర్తిగా అలీ వదిలేసినట్లే అని మరో పుకారు కూడా షికారు చేస్తోంది. అసలు విషయమేంటో.. అసలు వదులుకున్నాడో.. సంబంధాలు కొనసాగుతున్నాయో అలీ-పవన్‌లకే ఎరుక.

News About Pawan kalyan and Ali:

News About Pawan kalyan and Ali  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs